రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.44వ నెంబరు జాతీయ రహదారి, డోన్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పాతపేరు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం), వినోబాభావే విడిది చేసిన శివరాంపల్లి, పారిశ్రామికవాడ కాటేదాన్ ఈ మండలంలో ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా మండలకేంద్రం జిల్లా కేంద్రంగా మారింది.
సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉత్తరంవైపున హైదరాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. దక్షిణాన బాలాపూర్ మరియు శంషాబాద్ మండలాలు, పశ్చిమాన మొయినాబాద్ మండలం, వాయువ్యాన గండిపేట మండలం, ఉత్తరాన మరియు తూర్పున హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 188299. ఇందులో పురుషులు 98076, మహిళలు 90233. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 307317. ఇందులో పురుషులు 280974, మహిళలు 266474. అక్షరాస్యుల సంఖ్య 208860. పట్టణ జనాభా 282825, గ్రామీణ జనాభా 24492. రవాణా సౌకర్యాలు: దేశంలోనే అతి పొడవైన 44వ నెంబరు (పాతపేరు నెంబర్ 7) జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. బుద్వేల్‌లో రైల్వేస్టేషన్ ఉంది. మండలంలోని గ్రామాలు: అత్తాపూర్ (Attapur), బొంరుకుందౌలా (Bomrukundowla), బుద్వేల్ (Budwel), గగన్‌పహాడ్, (Gaganpahad), హైదర్‌గూడ (Hyderguda), కాటేదాన్ (Katedhan), లక్ష్మీగూడ (Lakshmiguda), మాదన్నగూడ (Madannaguda), మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally), పల్లెచెరువు (Pallecheruvu), ప్రేమవతిపేట్ (Premavathipet), సగ్‌బౌలి (Sagbowli), శివరాంపల్లి జాగీర్ (Shivarampally Jagir), శివరాంపల్లి పైగా (Shivarampally Paiga), సొగ్‌బౌలి (Sogbowli), ఉప్పరపల్లి (Upperpally)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Rajendranagar Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Jayashankar Agricultural University
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి