నందిగామ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. మహబుబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో ఉన్న 5 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇదేసమయంలో ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు మార్పుచెందింది. ఇది షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
కన్హా గ్రామసమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ఏర్పాటు చేయబడింది. జనవరి 28, 2020 నాడు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సరిహద్దులు: నందిగామ మండలానికి ఉత్తరాన కొత్తూరు మండలం, తూరౌన మహేశ్వరం మండలం, దక్షిణాన ఫరూఖ్‌నగర్ మండలం, పశ్చిమాన షాబాద్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు:సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం, 44వ నెంబరు జాతీయరహదారి కూడా మండలం నుంచి వెళ్ళుచున్నాయి. మండలంలోని గ్రామాలు: నందిగామ (Nandigam), చేగూర్ (Chegur), ఏదులపల్లి (Edulapalle), మామిడిపల్లి (Mamidipalle), వీర్లపల్లి (Veerlapalle) ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్‌పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్‌మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి