కూసుమంచి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజన్, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నవంబరు 11, 2017న తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు, పాలేరు జలాశయం ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం ఖమ్మం జిల్లా పశ్చిమం వైపున సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి ఉత్తరాన తిరుమలాయపాలెం మండలం, తూర్పున ఖమ్మం గ్రామీణ మండలం, దక్షిణాన నేలకొండపల్లి మండలం, పశ్చిమాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉ జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59971. ఇందులో పురుషులు 30146, మహిళలు 29825. కాలరేఖ:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కిష్టాపూర్ (Kistapur): కిష్టాపూర్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలమునకు చెందిన గ్రామము. నవంబరు 11, 2017న తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు. కూసుమంచి (Kusumanchi): కూసుమంచి ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. కూసుమంచి సమీపంలో వెయ్యేళ్ళ క్రితం కాకతీయ గణపతిదేవుడు నిర్మించిన కూసుమంచి శివాలయం ఉంది. పెద్దపెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పెట్టి వాటిపై శిల్పులు తీర్చిదిద్దిన కళాఖండాలు ఉన్నాయి. సుమారు 55 అడుగుల ఎత్తయిన శివలింగం చెక్కబడి ఉంది. పాలేరు (Paleru):
పాలేరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో పాలేరు సరస్సు పర్యాటకంగా పేరుపొందింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Singareni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి