షాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఇది చేవెళ్ళ రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రజాకార్లపై పోరాడిన గజవాడ మల్లయ్యగుప్త, రంగారెడ్డి జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన పి.సునీతారెడ్డి, తాండూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డి, 2సార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పట్నం నరేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. తెలంగాణలో తొలి టైల్స్ పరిశ్రమ మండలంలోని చందనవెల్లిలో ఏర్పాటు చేస్తున్నారు
సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లా పశ్చిమభాగంలో వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన చేవెళ్ళ మండలం, ఈశాన్యాన మొయినాబాదు మండలం, తూర్పున కొత్తూరు మరియు నందిగామ మండలాలు, దక్షిణాన ఫరూఖ్‌నగర్ మండలం, నైరుతిన కొందుర్గ్ మండలం, పశ్చిమాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47486. ఇందులో పురుషులు 24233, మహిళలు 23253. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51154. ఇందులో పురుషులు 26134, మహిళలు 25020. అక్షరాస్యుల సంఖ్య 27822. రాజకీయాలు: ఈ మండలం చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసిన సునీతా మహేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పట్నం మహేంద్రర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్‌పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్‌మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి