దుబాయి నగరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అతిపెద్ద మరియు ప్రముఖమైన నగరం. పర్షియన్ గల్ఫ్ ఆగ్నేయాన ఉన్న ఈ నగరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిగా ఉంది. మధ్యప్రాచ్యంలోనే దుబాయి నగరం ఒక ప్రముఖ వాణిజ్యనగరంగా మరియు రవాణా కార్గో హబ్‌గా పేరుపొందింది. 1969లో చమురు ఉత్పత్తి ప్రారంహమైన పిదప దుబాయి నగరం శరవేగంతో వృద్ధిచెందింది. ప్రస్తుతం చమురు ద్వారా ఆదాయఝ్ం తగ్గిననూ పర్యాటకంగా, ఏవియేషన్ ద్వారా, రియల్ ఎస్టేట్ వల్లనూ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా, క్రీడా ఈవెంట్లు తదితర మార్గాల ద్వారా ఆదాయం బాగుగా ఉంది.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన బుర్జ్ ఖలీఫాతో పాట్ పలు ఆకాశహర్మ్యాలు దుబాయి నగరంలో కనిపిస్తాయి. 1995లో కేవలం 6.74 లు ఉన్న జనాభా 2005 నాటికి 12.04 లక్షలతో రెండింతలైంది. ప్రస్తుత జనాభా 30 లక్షలకు చేరింది. ఇక్కడి జనాభాలోఅధిక సంఖ్యాకులు భారతీయులే. ఫుట్‌బాల్ మరియు క్రికెట్ ఇక్కడి జనాదరణ కల్గిన క్రీడలు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం కూడా దుబాయిలో ఉంది. 2009లో రగ్బీ ప్రపంచకప్‌ను ఈ నగరం నిర్వహించింది.
= = = = =
|
Tags: Dubai, Burj Khalifa, United Arab Emirates southeast coast of the Persian Gulf Abu Dhabi and Dubai are the only two emirates Dubai-Sharjah-Ajman metropolitan area Dubai International Airport busiest airport in the world by international passenger traffic
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి