రామచంద్రాపురం చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. ప్రముఖ రాజకీయ నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు, నేపథ్యగాయకుడు ఏ.ఎం.రాజా ఈ మండలమునకు చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున వడమలపేత మండలం, దక్షిణాన వెదురుకుప్పం మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన చంద్రగిరి మండలం, ఉత్తరాన తిరుపతి గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరులోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పుత్తూరు, నగరి నియోజకవర్గాల నుంచి 6 సార్లు శాసనసభకు ఎన్నికైన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని గ్రామాలు: అనుపల్లె, కట్టకింద వెంకటాపురం, కమ్మపల్లె, కుప్పంబడూరు, గంగమాంబాపురం, గంగిరెడ్డిపల్లె, చిత్తతూరు కాలెపల్లె, చుట్టగుంట రామాపురం, నడవలూరు, నెన్నూరు, నేత కుప్పం, ప్రసన్న వెంకటేశ్వరపురం, బ్రాహ్మణకాల్వ, రాయలచెరువు, రాయలచెరువు, రావిళ్లవారిపల్లె, సంజీవరాయ పురం, సేవోయికాల్వ, సొరకాయలపాలెం
= = = = =
|
Tags:Ramachandrapuram Mandal Chittoor District in Telugu, Chandragiri Assembly Constituency, Gali Muddukrishmana Naidu, A.M.Raja (Singer), Villages in Ramachandrapuram Mandal, Mandals in Cittoor Dist
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి