20, జులై 2018, శుక్రవారం

డెన్మార్క్ (Denmark)

 డెన్మార్క్
రాజధానికోపెన్ హాగెన్
అధికార భాషడానిష్
కరెన్సీక్రోన్


డెన్మార్క్ యూరప్ ఖండానికి చెందిన దేశము. స్కాండివేనియన్ దేశాలలో దక్షిణాన ఉన్న ఈ దేశం స్వీడన్, నార్వే, జర్మనీ సరిహద్దులను కలిగియుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఫారో మరియు గ్రీన్‌లాండ్ దీవులపై కూడా ఈ దేశానికి హక్కులున్నాయి. 443 దీవులతో కలిపి ఈ దేశ వైశాల్యం 42,924 చకిమీ మరియు ఫారో, గ్రీన్‌లాండ్ ద్వీపాలను కలిపి మొత్తం వైశాల్యం 2,210,579 చకిమీ. జనాభా 57,81,190. డానిష్ అధికార భాష కలిగియున్న ఈ దేశానికి రాజధాని కోపెన్‌హాగెన్. కరెన్సీ డానిష్ క్రోన్.


భౌగోళికం:
గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కాకుండా 16,577 చకిమీ వైశాల్యంతో డెన్మార్క్ ప్రపంచంలో 130వ పెద్ద దేశంగా ఉంది. జుట్‌లాండ్ మరియు 443 ప్రధాన ద్వీపాలు కల్గియున్న ఈ దేశం ఉత్తర యూరప్ ఖండానికి చెందినది. బాల్టిక్ సముద్రం, నార్త్ సీ తూర్పు పశ్చిమ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన జర్మనీ దేశం సరిహద్దును కలిగిఉంది. 4 పట్టణాలు లక్షకుపైగా జనాభాను కలిగియున్నాయి.

చరిత్ర:
డెన్మార్క్ చరిత్ర చాలా పురాతనమైనది. క్రీ.పూ.10000 నాటికే మానవులు నివసించినట్లుగా, క్రీ.పూ.4000 నాటికి వ్యవసాయం జరిగినట్లుగా చరిత్ర పరిశోధకులు నిర్థారించారు. క్రీ.శ.8-10 శతాబ్దాలలో బలమైన నావికాదళం కలిగిన దేశంగా ఖ్యాతిచెందింది. ఆధునిక కాలంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యం సాధించారు.1830లో జాతీయోద్యమం ద్వారా 1849లో రాచరిక రాజ్యాంగం ఏర్పడింది. 1850 తర్వాత పారిశ్రామికీకరణ వల్ల రైలు, రోడ్డు మార్గాలు ఏర్పడి పాడిపరిశ్రమ, మాంసం ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో డెన్మార్క్‌పై జర్మనీ దాడిచేసి లొంగదీసుకుంది. 1944లో స్వతంత్ర రిపబ్లిక్‌గా అవతరించింది.

క్రీడలు:
డెన్మార్క్ జాతీయ క్రీడ ఫుట్‌బాల్. 1992లో యూరోపియన్ చాంపియన్‌గా విజయం సాధించింది. టెన్నిస్ క్రీడాకారిణి కరోలిన్ ఒజ్నియాకి మహిళల విభాగంగా నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 2 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధించింది.


ఇవి కూడా చూడండి:
  • యూరప్ ఖండం,
  • కోపెన్‌హాగెన్, 
  • బాల్టిక్ సముద్రం,
  • ఉత్తర సముద్రం (నార్త్ సీ),
  • నీల్స్ బోర్ (రసాయన శాస్త్రవేత్త),
  • టైకోబ్రాహి (ఖగోళవేత్త),
  • విల్‌హీం జొహన్‌సన్ (వృక్షశాస్త్రవేత్త),
  • క్రిస్టియాన్ అయర్‌స్టెడ్ (భౌతికశాస్త్రవేత్త)

విభాగాలు: ప్రపంచ దేశాలు, డెన్మార్క్,


 = = = = =


Denmark in Telugu, Copenhagen, Official languages Danish, Currency Danish krone,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక