రేపల్లె గుంటూరు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం కృష్ణానది తీరాన ఉన్నది. జిల్లాలో అతి తూర్పున ఉన్న మండలం కూడా ఇదే. మండలానికి దక్షిణాన బంగాళాఖాతం ఉంది. వేములపల్లి శ్రీకృష్ణ, గొల్లపూడి సీతారామశాస్త్రి, మంగళగిరి ప్రమీలాదేవి, వెంకట నరసింహాచార్యులు ఈ మండలానికి చెందినవారు. ఈ మండలం రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో అతితూర్పున ఉంది. మండలానికి తూర్పున కృష్ణాజిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన నిజాంపట్నం, నగరం మండలాలు, ఉత్తరాన భట్టిప్రోలు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: రేపల్లెకు రైలుసదుపాయం ఉంది. రేపల్లె స్టేషన్ గుంటూరు డివిజన్ లో తెనాలి - రేపల్లె లైన్ కు చివరి స్టేషన్. రేపల్లె నుండి తెనాలి,గుంటూరు మరియు హైదరాబాద్ కు రైళ్ళు ఉన్నాయి. రేపల్లె లో బస్సు డిపో ఉన్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 113037. ఇందులో పురుషులు 54442, మహిళలు 58595. పట్టణ జనాభా 51938, గ్రామీణ జనాభా 61099. స్త్రీపురుష నిష్పత్తి (1076/వెయ్యి పురుషులకు)లో ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.
ముఖ్యమైన గ్రామాలు
బేతపూడి (Betapudi):బేతపూడి గుంటూరు జిల్లా రేపల్లె మండలంనకు చెందిన గ్రామము. "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించిన ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి వేములపల్లి శ్రీకృష్ణ (1917 - 2000) ఈ గ్రామంలోనే జన్మించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కారం, తెలుగు అకాడమి కీర్తి పురస్కారం పొందిన సాహితీవేత్త మంగళగిరి ప్రమీలాదేవి కూడా బేతంపూడి గ్రామానికి చెందినది. ఇస్లాంపూర్ (Islampur): ఇస్లాంపూర్ గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి శివారుకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన షంషీర్ ఖాన్ 1956లో మెల్బోర్న్ లో జరిగిన ఈతపోటీలలో (200మీ బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ ప్లై) భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1955లో కోల్కతలో జరిగిన జాతీయ స్విమ్మింగ్పోటీలలో 200మీ బటర్ ఫ్లైలో 57.6 సె.లలో ఈది జాతీయ రికార్డు నెలకొల్పాడు. కారుమూరు (Karumuru): కారుమూరు గుంటూరు జిల్లా రేపల్లె మండలంనకు చెందిన గ్రామము. గ్రామదేవత కారుమూరమ్మ. దేవాలయం చుట్టూ కారుమూరమ్మ చెరువు ఉంది.3 సార్లు రెపల్లె నుంచి ఎన్నికైన యడం చెన్నయ్య ఈ గ్రామానికి చెందినవారు. స్వాతంత్ర్యసమరయోధుడు నల్లూరు వెంకట నరసింహాచార్యులు ఈ గ్రామవాసే. ఇతను జైలుశిక్ష కూడా అనుభవించారు. గ్రామసర్పంచిగా కూడా పనిచేశారు. రేపల్లె (Repalle): రేపల్లె గుంటూరు జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రం. స్వాతంత్ర్యసమరయోధుడు గొల్లపూడి సీతారామశాస్త్రి స్వగ్రామం. 2006 సెప్టెంబరులో ఓగ్ని తుఫాను వల్ల పట్టణానికి తీవ్ర నష్టం సంభవించింది. తెనాలి నుంచి రేపల్లె పట్టణానికి రైలు సదుపాయం ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
22, మార్చి 2019, శుక్రవారం
రేపల్లె మండలం (Repalle Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి