28, జూన్ 2019, శుక్రవారం

సిక్కిం (Sikkim)

రాజధానిగాంగ్‌టక్
అధికార భాషనేపాలీ
జిల్లాలు4
జనాభా (2011)6,10,577
వైశాల్యం7,096 Sq km
సిక్కిం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఈ రాష్ట్రం దేశంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా, వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (గోవా తర్వాత) పేరుపొందింది. 1975లో భారతదేశంలో కలిసిన ఈ రాష్ట్రం అంతకు క్రితం సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండేది. 1975లో భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైన సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్, అధికారిక భాష నేపాలీ. ప్రపంచంలో 3వ ఎత్తయిన శిఖరం కాంచనగంగ సిక్కిం, నేపాల్‌లో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 4 జిల్లాలు కలవు. హిందూమతం, నేపాలీభాష ప్రాబల్యం వహిస్తున్నాయి. ఇక్కడి ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్.

భౌగోళికం, సరిహద్దులు:
సిక్కిం హిమాలయాలలో పర్వతమయమైన ప్రాంతంలో ఉంది. సిక్కిం రాష్ట్రానికి పశ్చిమాన నేపాల్, తూర్పున మరియు ఉత్తరాన టిబెట్ (చైనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. తీస్తా నది ఈ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నది.

చరిత్ర:
ఆధునిక కాలంలో భూటానీలు, నేపాలీలు సిక్కింపై పలుమార్లు దండెత్తి చివరకు నేపాలీలు సిక్కింలో చాలాభాగాన్ని ఆక్రమించారు. తర్వాత సిక్కిం బ్రిటిషువారితో చేతులు కలిపింది. 1814లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి, నేపాలుకు మధ్య గూర్ఖా యుద్ధం జరిగిన తర్వాత కోల్పోయిన ప్రాంతం అంతా సిక్కింకు తిరిగి లభించింది. తర్వాతి కాలంలో సిక్కింకు, బ్రిటిష్-ఇండియా వారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో మధ్య దేశమైంది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. చివరకు 1975 మే 16న రాజరికం రద్దయి సిక్కిం భారతదేశంలో విలీనమైంది.

రాజకీయాలు:
1975 విలీనం తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1979వరకు అధికారంలో ఉంది. 1979లో సిక్కిం పరిషత్ పార్టీకి చెందిన నర్‌బహదూర్ భండారీ, 1994 ఎన్నికల్లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. 11994, 1999, 2004, 2009లలో కూడా సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీలు విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో ఒక లోక్‌సభ స్థానం, ఒక రాజ్యసభ స్థానం ఉన్నాయి.
సిక్కిం జీవనదిగా పిల్వబడే తీస్తానది

ఆర్థికవ్యవస్థ:
సిక్కిం ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారింజకాయలు, ఆపిల్ పండ్లు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. కొండప్రాంతం కావడంతో ఇక్కడ పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
2018లో సిక్కింకు విమానయాన సౌకర్యం కలిగింది. గాంగ్‌టక్ సమీపంలో పాక్యాంగ్‌లో విమానాశ్రయం ప్రారంభించబడింది. జాతీయరహదారి నెంబర్ 10 సిల్గురి నుంచి గాంగ్‌టక్‌కు కల్పుతుంది. రాష్ట్రంలో రైలు రవాణా సదుపాయం లేదు.

ఇవి కూడా చూడండి:
  • సిక్కిం రాష్ట్ర ప్రముఖులు,
  • సిక్కిం రాష్ట్ర నగరాలు, పట్టణాలు,
  • సిక్కిం రాష్ట్ర గవర్నర్లు,
  • సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రులు,
  • హిమాలయ పర్వతాలు,

హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, సిక్కిం,


 = = = = =


Tags: about Sikkim state in Telugu, Indian states information in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక