11, సెప్టెంబర్ 2019, బుధవారం

పి.ఆనందాచార్యులు (P.Anandacharya)

జననం1843
రంగంన్యాయవాది, సమరయోధుడు
పదవులుకాంగ్రెస్ అధ్యక్షుడు (1891)
మరణం1908
న్యాయవాదిగా, జాతీయోద్యమ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన పనప్పాకం ఆనందాచార్యులు చిత్తూరు జిల్లా కట్టమంచి (కడమంచి?)లో 1843లో జన్మించారు. ఈయన పుర్వీకులు చెంగల్పట్టు జిల్లాకు చెందినవారైననూ ఈయన తండ్రి ఇప్పటి చిత్తూరు జిల్లాలో కోర్టులో పనిచేసి స్థిరపడ్డారు. ఆనందాచార్యులు ప్రారంభంలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఆ తర్వాత న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదిగా మారారు. న్యాయవాదిగా పనిచేస్తూ రాజకీయాలపై మరియు జాతీయోద్యమంపై ఆసక్తి చూపారు. 1884లో మద్రాసు మహాజనసభను స్థాపించారు. ఆ తర్వాతి ఏడాది 1885లో ముంబాయిలో జరిగిన మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరైనారు. ఆ సదస్సుకు హాజరైన 72 గురులో ఆనందాచార్యులు ఏకైక తెలుగు వ్యక్తి. 1891లో నాగ్పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహించారు. పీపుల్స్ మేగజైన్ పత్రికకు సంపాదకత్వం కూడా వహించిన ఆనందాచార్యులు 1908లో మరణించారు.

ఇవి కూడా చూడండి:
  • భారత జాతీయ కాంగ్రెస్,
  • భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల పట్టిక,



హోం
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు,


 = = = = =


Tags: Panappakam Anandacharyulu P.Anandacharya biography

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక