ప్రముఖ న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన రాంజెఠ్మలాని ఏప్రిల్ 14, 1923న సికార్‌పూర్ (ప్రస్తుత పాకిస్తాన్)లో జన్మించారు. ఇప్పటి పాకిస్తాన్‌లోని సింధ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి, దేశవిభజన తర్వాత ముంబాయి వలస వచ్చారు.
దేశంలోనే ప్రఖ్యాతి కేసులు మరియు సంచలనం సృష్టించిన కేసులను వాదించిన ఘనత ఈయనకు దక్కుతుంది. ఇందిర, రాజీవ్ హత్యకేసులు, హర్షత్ మెహతా, కేతన్ పరేఖ్, అఫ్జల్ గురు, సోహ్రబుద్దీన్, హాజీమస్తాం, కనిమొళి, కేజ్రీవార్, జయలలిత, బాబా రాందేవ్ తదితరుల కేసులలో రాంజెఠ్మలాని వాదించారు. సుప్రీంకోర్టులో అత్యధిక ఫీజు తీసుకొనే న్యాయవాదిగానూ ఈయన పేరుపొందారు. హక్కుల ఉద్యమానికి చేసిన కృషికిగాను జెఠ్మలాని 1977లో మానవహక్కుల అవార్డు పొందారు. భాజపా తరఫున 6వ, 7వ లోక్‌సభలకు ఎన్నికై వాజపేయి మంత్రివర్గంలో పనిచేశారు. తర్వాత వాజపేయిపైనే (లక్నోలో) పోటీచేసి సంచలనం సృష్టించారు. 2013 వరకు భాజపా లోనూ, ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో కొనసాగారు. 1992 రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసి మూడోస్థానం పొందారు. భారత్ ముక్రిమోర్చా పేరుతో రాజకీయ వేదికను స్థాపించడమే కాకుండా 1995లో పవిత్ర హిందుస్థాన్ కజగం పేరుతో రాజకీయ పార్టీ నెలకొల్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్‌గా ఎన్నికైన జెఠ్మలాని ఆత్మకథ పేరు "ది రెబెల్". 95 సం.ల వయస్సులో సెప్టెంబరు 8, 2019న మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
8, సెప్టెంబర్ 2019, ఆదివారం
రాంజెఠ్మలాని (Ram Jethmalani)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి