30, ఏప్రిల్ 2020, గురువారం

ఉత్తర కొరియా (North Korea)

ఉత్తర కొరియా
ఖండంఆసియా
రాజధానిప్యాన్‌గాంగ్
వైశాల్యం1,20,540 చకిమీ
జనాభా 2.55 కోట్లు
కరెన్సీవన్
అధికారికంగా డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పిల్వబడే ఉత్తరకొరియా దేశం తూర్పు ఆసియాలో కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తరభాగంలో ఉంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత కొరియా రెండు ముక్కలై దక్షిణ భాగం అమెరికా వైపు, ఉత్తర భాగం సోవియట్ వైపు మ్రొగ్గుచూపాయి. అప్పటినుంచి ఉభయ కొరియాల మధ్య సంబంధాలు విషమంగానే ఉన్నాయి. 1950-53 కాలంలో ఉభయ కొరియాల మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత దక్షిణ కొరియా ప్రజాస్వామ్యదేశంగా ప్రగథిపథంలోకి వెళ్ళగా, కమ్యూనిస్టు పథం అనుసరించిన ఉత్తర కొరియా మాత్రం వెనకంజలో ఉంది. ఉత్తర కొరియా రాజధాని మరియు పెద్ద నగరం ప్యాంన్‌గాంగ్, కరెన్సీ వన్ (won), అధికార భాష కొరియన్. దేశ వైశాల్యం 1,20,540 చకిమీ.

భౌగోళికం, సరిహద్దులు:
తూర్పు ఆసియాలో కొరియన్ ద్వీపకల్పం ఉత్తర భాగంలో ఉన్న ఉత్తర కొరియా  37° - 43° ఉత్తర అక్షాంశం మరియు 124° - 131° తుర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది. ఉత్తరాన చైనా మరియు కొంతవరకు రష్యా, దక్షిణాన దక్షిణ కొరియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమాన ఎల్లో సముద్రం, తూర్పున జపాన్ సముద్రం ఉన్నాయి.

చరిత్ర:
1910లో కొరియాను జపాన్ ఆక్రమించింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో కొరియా రెండు ముక్కలై ఉత్తర భాగం సోవియట్ అధీనంలో, దక్షిణ భాగం అమెరికా అధీనంలోకి వెళ్ళాయి. కొంతకాలానికే ఉభయ కొరియాల నుంచి సోవియట్, అమెరికా దళాలు కూడా నిష్క్రమించాయి. దీంతో 1950లో ఉభయ కొరియాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 1953 వరకు కొనసాగిన యుద్ధం వల్ల ఉభయ కొరియాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత కూడా ఉభయ కొరియాల మధ్య తీవ్ర విధ్వేషాలు ఉన్నాయి. ఉత్తర కొరియా సైనిక బలగాన్ని బాగా పెంచింది. ప్రస్తుతం చైనా, అమెరికా, భారత్‌ల తర్వాత అత్యధిక సైనిక బలగాలున్న 4వ దేశంగా నిలిచింది. అంతేకాకుండా అణుపాటవాన్ని కూడా సమకూర్చుకుంది. 2019లో అమెరికాకే సవాలు విసిరింది.

ఉత్తర కొరియా జెండా
పరిపాలన:
పేరుకు ఉత్తర కొరుయాప్రజాస్వామ్య దేశమైననూ ఏకపార్టీపాలన అందులోనే వారసత్వంగా వచ్చిన కిమ్‌ వంశస్థులే పాలన కొనసాగిస్తున్నారు. అక్కడి పాలనా విషయాలు బాహ్యప్రపంచానికి అధికంగా తెలియనివ్వడం లేదు. సమాచార సాధనాలు, మీడియా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ప్రజలకు ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండదు. పాలకులు చెప్పిందే తప్ప అసలు వాస్తవాలు తెలియవు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రభుత్వానికి లేదా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించరు. ఎన్నికలు జరగడం నామమాత్రమే. 1994 వరకు కిమ్‌ ఇల్ సంగ్ పాలించగా, కిమ్‌ జోంగ్ ఇల్, ప్రస్తుతం కిమ్‌ జోంగ్ ఉన్ అధికారంలో ఉన్నారు.

క్రీడలు:
ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెబుల్ టెన్నిస్ ఇక్కడి జనాదరణ పొందిన క్రీడలు. ఉత్తర కొరియా ఫుట్‌బాల్ జట్టు 2010 ఫీఫా కప్‌లో పాల్గొంది. 1964 నుంచి ఉత్తర కొరియా ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటుంది. 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను అప్పటి అమెరికా వ్యతిరేక దేశాలకు మద్దతుగా బహిష్కరించింది. 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్‌ను కూడా దక్షిణ కొరియా నిర్వహించినందున పాల్గొనలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ కిమ్‌ ఉన్ గుక్ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించాడు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ప్రపంచ దేశాలు, ఉత్తర కొరియా,


 = = = = =


North Korea in Telugu Countries information in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక