సినీనటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రసిద్ధి చెందిన రిషికపూర్ సెప్టెంబరు 4, 1952న ముంబాయిలో జన్మించారు. తాత పృథ్వీరాజ్ కపూర్ తొలితరం సినీప్రముఖుడు కాగా తండ్రి రాజ్‌కపూర్ కూడా ప్రముఖ నటుడు, దర్శకుడుగా పేరుపొందారు. కుమారుడు రణబీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపుర్‌లు కూడా సినీనటులుగా పేరుపొందారు, భార్య నీతూసింగ్ కూడా సినీనటి. ఈమెతో 15 సినిమాలలో కలిసి నటించి 1980లో వివాహం చేసుకున్నాడు.
తొలిసారిగా 1970లో మేరా నామ్ జోకర్ సినిమాలో బాలనటుడిగా సినీప్రవేశం చేసిన రిషికపూర్ ఆరంగేట్ర సినిమాలోనే ఉత్తమ బాలనటుడిగా జాతీయ ఫిలింఫేర్ అవార్డు పొందాడు. 1973లో డింపుల్ కపాడియాతో జతగా నటించిన బాబీ సినిమా ఈయన హీరోగా నటించిన తొలి సినిమా. 1974లో బాబీలో నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. 1973 నుంచి తన సినీ జీవితంలో 92 సినిమాలలో నటించారు. ఇందులో 51 సినిమాలలో హీరోగా నటించగా అందులో బాబీ, లైలామజ్నూ, సర్గమ్, నగీనా, బోల్ రాధా బోల్, దీవానా, చాందినీ సినిమాలు ఈయనకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. 2008లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన రిషికపూర్ వాస్తవాలను నిర్భయంగా బయటపెట్టేవారు. 2017లో ఖుల్లంకుల్ల పేరుతో ఆత్మకథను విడుదల చేశారు. ఏప్రిల్ 30, 2020న ముంబాయిలో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
30, ఏప్రిల్ 2020, గురువారం
రిషికపూర్ (Rishi Kapoor)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి