26, మే 2020, మంగళవారం

జైపాల్ సింగ్ ముండా (Jaipal Singh Munda)

జైపాల్ సింగ్ ముండా
జననంజనవరి 3, 1903
రంగంక్రీడాకారుడు, ఉద్యమనాయకుడు
మరణంమార్చి 20, 1970
హాకీ క్రీడాకారునిగా, ఆదివాసీల ఉద్యమ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన జైపాల్ సింగ్ ముండా జనవరి 3, 1903న ప్రస్తుత ఝార్ఖండ్‌లోని రాంచీ వద్ద టక్రాలో జన్మించారు. ప్రమోద్ పహాన్ అని కూడా పిల్వబడే జైపాల్ సింగ్ 1946లో భారత రాజ్యాంగ నిర్మాణసభలో సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రారంభంలో ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపికై ఆ తర్వాత రాజీనామా చేసి కొంతకాలం 1934లో ఘనా దేశంలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి తర్వాత 1938లో బికానేర్ సంస్థానంలో చేరి విదేశాంగ కార్యదర్శిగా వ్యవహరించారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే హాకీ క్రీడాకారునిగా పేరుపొందారు. 1928లో బ్రిటీష్ పాలన కాలంలో ఆమ్‌స్టర్‌డాంలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో తొలిసారిగా పాల్గొన్న భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత బెంగాల్ హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. 1939లో ఆదివాసి మహాసభ స్థాపించి దానికి అధ్యక్షుడై ఆదివాసీల హక్కులకై ఉద్యమించారు. 1940 కాంగ్రెస్ సదస్సులో ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్ర ఆవశ్యకత గురించి సుభాష్ చంద్రబోస్‌తో చర్చలు జరిపారు.

ఈయన స్థాఫించిన ఆదివాసి మహాసభ తర్వాత ఝార్ఖండ్ పార్టీగా మార్పుచెందింది. 1952 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఝార్ఖండ్ పార్టీ 33 స్థానాలలో, 1960లో 20 స్థానాలలో విజయం సాధించింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఝార్ఖండ్ పార్టీ తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని లేఖ అందించిననూ ఆ ప్రాంతంలో పలు భాషలవారు ఉండటంతో ప్రత్యేక రాష్ట్రంకై కమిటి సిఫార్సు చేయలేదు. 1963లో ఝార్ఖండ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబడింది.

జీవితాంతం ఆదివాసీల కోసం ఉద్యమించి ఆదివాసీలచే మరాంగ్ గోంకే (మహా నాయకుడు)గా పిల్వబడ్డ జైపాల్ సింగ్ మార్చి 20, 1970న ఢిల్లీలో మరణించారు . ఈయన సేవలకు గుర్తుగా 2013లో రాంచీలో ఒక స్టేడియానికి జైపాల్ సింగ్ పేరుపెట్టబడింది.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ప్రముఖ భారత హాకీ క్రీడాకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక