26, మే 2020, మంగళవారం

బల్బీర్ సింగ్ (Balbir Singh)

బల్బీర్ సింగ్
జననండిసెంబరు 31, 1923
రంగంహాకీ క్రీడాకారుడు
గుర్తింపులుపద్మశ్రీ
మరణంమే 25, 2020
ప్రముఖ హాకీ ఆటగాడిగా, కోచ్‌గా, మేనేజర్‌గా పేరుపొందిన బల్బీర్ సింగ్ డిసెంబరు 31, 1923న పంజాబ్‌లోని హరిపూర్ ఖల్సాలో జన్మించారు. 3 సార్లు ఒలింపిక్ స్వర్ణం సాధించిన భారత హాకీజట్టులో సభ్యుడిగా ఉన్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో సభ్యుడిగా, 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో వైస్-కెప్టెన్‌గా, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా ఉంటూ భారత హాకీజట్టుకు ఒలింపిక్ స్వర్ణాన్ని అందించారు. అంతర్జాతీయ ఒలింపిక్‌లో గొప్ప అథ్లెట్లుగా గుర్తించబడ్డ 16గురిలో బల్బీర్ ఏకైక భారతీయుడిగా నిలిచారు. ఒలింపిక్ హాకీ ఫైన్ మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు ఇప్పటికీ బల్బీర్ పేరిటే ఉంది. 1952 హెల్సింకీ ఒలింపిక్ ఫైనల్లో బల్బీర్ 5 గోల్స్ గోల్స్ చేయగా భారత్ ఆ మ్యాచ్‌ను 6-1తో నెదర్లాండ్స్‌పై గెల్చింది.

ఈయన సేవలకుగాను 1957లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. బల్బీర్ సింగ్ ఈ పురస్కారం పొందిన తొలి క్రీడాకారుడిగా అవతరించారు. ఆటకు విరమణ చేసి ఈయన కోచ్‌గా ఉన్నప్పుడు భారతజట్టు 1971 ప్రపంచకప్ కాంస్యం సాధించింది. 1975లో ఈయన మేనేజర్‌గా ఉన్నప్పుడు భారతజట్టు ప్రపంచకప్ స్వర్ణాన్ని సాధించింది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే చివరి పతకం. 2015లో ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ పురస్కారం పొందారు.

96 సంవత్సరాల వయస్సులో బల్బీర్ మే 25, 2020న మొహలీలో మరణించారు. ఈయన సేవలకు గుర్తుగా మొహలీ స్టేడియానికి బల్బీర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించబడింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ప్రముఖ భారత క్రీడాకారులు, హాకీ క్రీడాకారులు, పంజాబ్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక