22, మే 2020, శుక్రవారం

ఎల్.కె.ఝా (L.K.Jha)

ఎల్.కె.ఝా
జననంనవంబర్ 22, 1913
రంగంఆర్థికవేత్త
పదవులురిజర్వ్ బ్యాంక్ గవర్నర్, జమ్మూకశ్మిర్ గవర్నర్
మరణంజనవరి 16, 1988
భారతదేశపు ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన ఎల్.కె.ఝా పూర్తిపేరు లక్ష్మీకాంత్ ఝా. ఈయన నవంబర్ 22, 1913న బీహార్‌లో జన్మించారు. ఇండియన్ సివిల్ సర్వీస్‌లో చేరి ప్రధానమంత్రి కార్యదర్శిగా, ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా, జమ్మూకశ్మిర్ గవర్నరుగా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యునిగా ఉంటూ జనవరి 16, 1988న మరణించారు.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన ఎల్.కె.ఝా ఉన్నతవిద్యకు ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జికి వెళ్ళి అక్కడ ప్రఖ్యాత ఆర్థికవేత్తలైన పిగూ, కీన్స్, రాబర్ట్‌సన్ ల శిష్యరికంలో నిపుణత సాధించారు. 1936లో భారతదేశం తిరిగివచ్చి ఇండియన్ సివిల్ సర్వీసులో చేరి బీహార్‌లోని అనేక జిల్లాల్లోనూ, రాష్ట్ర సెక్రటేరియట్లోనూ పనిచేసిన తర్వాత 1942లో ఈయన కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యారు. అంచెలంచెలుగా పదోన్నతలు పొందుతూ అనేక ఉన్నత పదవులు పొందారు. 1960లో ఆర్థికమంత్రిత్వ శాఖలో సెక్రటరీ పదవి చేపట్టారు. 1964లో లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొత్తగా సృష్టించిబడిన పదవిలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా. ఆ తరువాత అదే హోదాలో ఇందిరాగాంధీ కాలంలో కూడా పనిచేశారు. 1967-70 కాలంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా, 1973-81 వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు. జనవరి 16, 1988 న మరణించే నాటికి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ఆర్థికవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు, జమ్మూకశ్మీర్ గవర్నర్లు, 1988లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక