నర్మెట్ట జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నిమ్మ రాజిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో బొమ్మకూర్ జలాశయం ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా తరిగోపుల మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తరిగొప్పుల మండలం, తూర్పున స్టేషన్ ఘన్‌పూర్ మండలం, దక్షిణాన రఘునాథపల్లి మండలం మరియు జనగామ మండలం, పశ్చిమాన బచ్చన్నపేట మండలం, వాయువ్యాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42363. ఇందులో పురుషులు 21064, మహిళలు 21299. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో నర్మెట్ట జడ్పీటీసిగా ఎన్నికైన గద్దెల పద్మ వరంగల్ జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఎన్నికైనారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన తేజావత్ గోవర్థన్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మాలోతు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
నర్మెట్ట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ammapur, Bommakur, Gandiramaram, Hanmanthapur, Machupahad, Malakpet, Narmetta, Veldanda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అమ్మాపూర్ (Ammapur): అమ్మాపూర్ జనగామ జిల్లా నర్మెట్ట మండలమునకు చెందిన గ్రామము. గ్రామానికి చెందిన మోతె జగన్నాథ్ బృందం చెక్కబొమ్మలాట ప్రదర్శనలో ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ కళను దేశం మొత్తంలో రెండు బృందాలు మాత్రమే ప్రదర్శిస్తున్నాయి. వాటిలో ఇది ఒకటి అని ఆచార్య జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. వెల్దండ (Veldanda):
వెల్దండ వరంగల్ జిల్లా నర్మెట్ట మండలానికి చెందిన గ్రామము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నిమ్మ రాజిరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narmetta Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి