ముత్తారం పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలపు దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పడిన రామగిరి మండలంలో విలీనం చేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రామగిరి మండలం మరియు మంథని మండలం, పశ్చిమాన శ్రీరాంపూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జుక్కుల ముత్తయ్య, జడ్పీటీసిగా తెరాసకు చెందిన చీల్కల స్వర్ణలత ఎన్నికయ్యారు. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 26413. ఇందులో పురుషులు 13244, మహిళలు 13169. అక్షరాస్యత శాతం 52.91%.
ముత్తారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adavisrirampur, Dharyapur, Ippalapalli, Kesanapalli, Khammampalli, Lakkaram, Matchupeta, Mutharam, Mydambanda, Odedu, Parupalli, Potharam, Sarvaram, Shatharajpalli, Sukravarampeta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mutharam Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి