పాలకుర్తి పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకు క్రితం కరీంనగర్ జిల్లా రామగుండం, కమాన్‌పూర్ మరియు వెల్గటూరు మండలాలలో ఉన్న 13 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. కాజీపేట-బల్లార్షా రైల్వేలైన్ మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన అంతర్గాం మండలం, రామగుండం మండలం, తూర్పున రామగుండం మండలం, ఆగ్నేయాన కమాన్‌పూర్ మండలం, దక్షిణాన పెద్దపల్లి మండలం, పశ్చిమాన ధర్మారం మండలం, వాయువ్యాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం ధర్మపురి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వ్యాళ్ల అనసూయ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన కందుల సంధ్యారాణి ఎన్నికయ్యారు.
పాలకుర్తి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: పుట్నూరు (Putnoor), గుడిపల్లి (Gudipalli), జయ్యారం (Jayyaram), ఏసల తక్కలపల్లి (Eesala Thakkallapalli), పాలకుర్తి (Palakurthy), కుక్కలగూడూర్ (Kukkalagudur), వెమ్నూర్ (Vemnoor ), ఎల్కలపల్లి (Elkalapalli), కన్నాల (Kannala), రాణాపూర్ (Ranapur), ముంజంపల్లి (Munjampalli), మారేడుపల్లి (Maredupalli), ఉండెల (Undeda)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Palakurthy Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి