24, జులై 2020, శుక్రవారం

శకుంతలా దేవి (Shakuntala Devi)

జననంనవంబరు 4, 1929
జన్మస్థానంబెంగళూరు
రంగంగణితం, రచయిత్రి
మరణంఏప్రిల్ 21, 2012
గణిత మేధావిగా, రచయిత్రిగా పేరుపొందిన శకుంతలాదేవి నవంబరు 4, 1929న బెంగళూరు (కర్ణాటక) లో జన్మించారు. చిన్న వయస్సు నుంచే గణితంలో ప్రతిభ ప్రదర్శించి పలు ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో గణిత ప్రదర్శలతో మన్నలలందుకున్నారు. తన అపారమైన గణితమేధస్సుతో 1980లో లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో ఇచ్చిన గణిత ప్రదర్శన హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాదించారు. రెండు 13 అంకెల గుణకారాన్ని కేవలం 28 సెకన్లలోనే గణించి అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా ప్రపంచరికార్డుగా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందారు. (97,686,369,774,870 × 2,465,099,745,779 = 18,947,668,177,995,426,462,773,730). శకుంతలాదేవి ఏప్రిల్ 21, 2012న బెంగళూరులో మరణించారు.

శకుంతలాదేవికి 1960లో ఐఏఎస్ అధికారి హరితోష్ ముఖర్జీతో వివాహమైంది. కాని కొంతకాలానికే విడిపోయారు. భర్త హోమోసెక్సువల్, ఆ అనుభవంతో శకుంతలాదేవి "ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్" పుస్తకం రాశారు. శకుంతలాదేవి ఇతర రచనలు: ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యూ, పజిల్స్ టు పజిల్స్.

1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన శకుంతలాదేవి 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీపై పోటీచేశారు. 2020లో దర్శకుడు అనూమీనన్ శకుంతలాదేవి జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మించారు. ఇందులో శకుంతలాదేవి పాత్రధారి విద్యాబాలన్.


ఇవి కూడా చూడండి:
  • శ్రీనివాస రామానుజన్,

హోం
విభాగాలు: కర్ణాటక ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు, గణితశాస్త్ర ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక