29, నవంబర్ 2020, ఆదివారం

వాణి జయరాం (Vani Jairam)

జననం
నవంబరు 30, 1945
స్వస్థలం
వెల్లూర్ (తమిళనాడు)
రంగం
గాయని
అవార్డులు
3 సార్లు జాతీయ ఫిలింఫేర్ అవార్డులు
దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ గాయనిగా పేరుపొందిన వాణి జయరాం నవంబరు 30, 1945తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఈమె అసలుపేరు కలైవాణి. (1969లో వివాహం తర్వాత భర్త జయరాం పేరు జత అయింది). 1971లో తొలిసారిగా హిందీ సినిమా "గుడ్డి" ద్వారా సినీగాయనిగా ప్రస్థానం ఆరంభించి 4 దశాబ్దాలపాటు గాయనిగా రాణించింది. వాణి జయరాం 4 దశాబ్దాల తన సినీకెరీర్‌లో వెయ్యికి పైగా సినిమాలలో పాటలు పాడింది. ఇతర భక్తిగానాలు, ప్రైవేట్ అల్బమ్స్ కలిపి 20వేలకు పైగా పాటలు పాడింది. 3 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ ఫిలింఫేర్ అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల సినీ అవార్డులు పొందింది. 2012లో ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.

సినీప్రస్థానం:
1971లో వాణి జయరాం పాడిన తొలి పాట హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలోని "గుడ్డి" (1971) సినిమాలోనిది. ఈమె పాడిన తొలి తెలుగు సినిమా "అభిమానవంతులు" (1973). 1975లో తమిళ సినిమా "అపుర్వ రాగాందల్" సినిమాలో పాటలకై తొలి సారిగా జాతీయ ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1975లో "పూజ" సినిమా ఈమెకు మంచి గుర్తింపు ఇచ్చింది. హిట్ సాంగ్‌గా పేరుపొందిన "ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ..." పాట ఈ సినిమాలో ఉంది. 1976లో కె.విశ్వనాథ్ తీసిన "శంకరాభరణం" సినిమా పాటలు ఈమె గుర్తింపును అధికం చేశాయి. శంకరాభరణం సినిమా పాటలు జనాదరణ పొందడమే కాకుండా ఈ సినిమాకై వాణిజయరాంకు రెండోసారి జాతీయ ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1990లో తీసిన "స్వాతికిరణం" సినిమా పాటలకై మూడోసారి జాతీయ ఫిలింఫేర్ అవార్డు పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తమిళనాడు ప్రముఖులు, సినీ పాటల గాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక