చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 21
- 1853: కవి, నాటకకర్త వేదము వేంకటరాయ శాస్త్రి జననం
- 1890: అమెరికాకు చెందిన జన్యుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్మన్ జోసెఫ్ ముల్లర్ జననం
- 1918: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆస్ట్రియాకు చెందిన కుర్ట్ మాల్దీమ్ జననం
- 1928: మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త శివానందమూర్తి జననం
- 1931: కథా మరియు నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు జననం
- 1932: కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి జననం (జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతల జాబితా)
- 1954: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి క్రిస్ ఎవర్ట్ జననం
- 1959: భారత క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జననం (భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
- 1963: బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు గోవిందా జననం
- 1972: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జననం (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
- 1972: తెలుగు సినీనటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
- 1973: కల్లూరు సుబ్బారావు మరణం
- 2009: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎడ్విన్ క్రెబ్స్ మరణం
- 2020: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మోతీలాల్ ఓరా మరణం (మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి