22, డిసెంబర్ 2020, మంగళవారం

మోతీలాల్ ఓరా (Motilal Vora)

జననం
డిసెంబరు 20, 1928
రంగం
రాజకీయ నాయకుడు
పదవులు
ముఖ్యమంత్రి, గవర్నరు, కేంద్రమంత్రి,
మరణం
డిసెంబరు 21, 2020
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా, ఏఐసిసి కోశాధికారిగా పనిచేసిన మోతీలాల్ ఓరా డిసెంబరు 20, 1928న నింబిజోధా (రాజస్థాన్)లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మొదట్లో సమాజ్‌వాది పార్టీలో ఉంటూ దుర్గ్ పురపాలకసంఘం సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పలు ఉన్నత పదవులు పొందారు. పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఉన్నత పదవులు పొందారు. డిసెంబరు 21, 2020న మరణించారు. ఈయన కుమారుడు అరుణ్ ఓరా కూడా 3సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
ప్రారంభంలో దుర్గ్ పురపాలక సంఘం సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మోతీలాల్ ఓరా 1972లో తొలిసారిగా మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయారు. ఆ తర్వాత 1977, 1980లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అర్జున్ సింగ్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పదవి పొందారు. కొంతకాలం మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆలిండియా కాంగ్రెస్ కమిటి కోశాధికారిగా పనిచేశారు. 1985-89లలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. 1993లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పదవి చేపట్టి 1996 వరకు పనిచేశారు. 1998లో 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, ఛత్తీస్‌గఢ్ ప్రముఖులు, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక