(ఇది మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలం. మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం కోసం ఇక్కడ చూడండి) బాలానగర్ మండలము మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలము. 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు - డోన్ రైలుమార్గము మండలము గుండా వెళ్ళుచున్నాయి. ఈ మండలము మహబూబ్ నగర్ మరియు హైదరాబాదు మధ్యలో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66894. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. గుండ్లపోచంపల్లి, రాజాపూర్, రంగారెడ్డిగూడ, గుండేడు, కుచ్చర్కల్, బాలానగర్, ఉడిత్యాల్, పెద్దాయిపల్లిలలో పరిశ్రమలున్నాయి. విమోచనోద్యమకారుడు సర్రాఫ్ వెంకటేశ్వరరావు ఈ మండలమునకు చెందినవారు.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున షాద్ నగర్ మండలం, తూర్పున కేశంపేట్ మండలం, దక్షిణమున జడ్చర్ల మండలం, పశ్చిమమున నవాబ్ పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61592. ఇందులో పురుషులు 31283, మహిళలు 30309. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66894. ఇందులో పురుషులు 34141, మహిళలు 32753. జనాభాలో ఇది జిల్లాలో 18వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి మరియు రైల్వేలైన్ వెళుచున్నందున రవాణా సౌకర్యం బాగుగా ఉంది. మండలంలో 3 రైల్వేస్టేషన్లు కలవు. అవి బాలానగర్, రంగారెడ్డి గూడా మరియు రాజాపూర్. రాజకీయాలు: ఈ మండలము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోదండరామిరెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంచిరాల సాయికృష్ణ ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన భాగ్యమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 87 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 86 మండల పరిషత్తు), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 5 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.
రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండుట మరియు జాతీయ రహదారిపై ఉండుటచే మండలంలో పరిశ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో బిలాస్ రైకా స్పాంజ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జీటీఎస్ ఇండస్ట్రీస్ (యార్న్ ప్రాసెసింగ్), రాజాపూర్ లో కూల్-వెల్ హైటెక్ కోల్డ్ స్టోరేజి లిమిటెడ్, సల్గురి ఇండస్ట్రీస్, సూర్యజ్యోతి స్పిన్నింగ్ మిల్స్, విజయ్ టెక్స్ టైల్స్ లిమిటెడ్, రంగారెడ్డిగూడలో జీఆర్ కేబుల్స్ లిమిటెడ్, బాలానగర్ మండల కేంద్రంలో జీవీకె నోవాపాన్ ఇండస్ట్రీస్, సువర్ణ అపారెల్ లిమిటెడ్, గుండేడులో ఎంవైకే స్పిన్నింగ్ ఇండస్ట్రీస్, మహావీర్ ఫెర్రో అల్లాయ్స్, దిలీప్ రీరోలింగ్ లిమిటెడ్, అప్పాజీపల్లిలో రియాక్టివ్ మెటల్స్ లిమిటెడ్, కుచ్చర్లల్ లో సూర్యజ్యోతి స్పిన్నింగ్ మిల్స్, ఉడిత్యాలలో తన్మయి ఇస్పాత్ లిమిటెడ్, పెద్దాయిపల్లిలో కాంటూర్ స్టీల్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పరిశ్రమలు కలవు. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 27916 హెక్టార్లలో 30% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు మొక్కజొన్న,వరి. కందులు, జొన్నలు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 596 మిమీ. మండలంలో సుమారు 2900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. సంఘటనలు:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
బాలానగర్ మండలము (Balanagar Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి