జడ్చర్ల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. జిల్లా కేంద్రము మహబూబ్‌నగర్‌కు సమీపంలో ఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. దుందుభీనది మండలం గుండా ప్రవహిస్తుంది. మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు, 26 గ్రామపంచాయతీలు కలవు. గంగాపూర్ లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శ్రీ చెన్నకేశ్వస్వామి ఆలయం, నస్రుల్లాబాదులో నిజాం కాలం నాటి పురాటన కట్టడాలు, పోలెపల్లిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రారంభమైన సెజ్ (పారిశ్రామికవాడ), గొల్లపల్లిలో లలితాంబికా తపోవనక్షేత్రం ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప జైనమత కేంద్రంగా ఉండిన ఆల్వాన్‌పల్లి ఈ మండలంలో ఉంది. స్వాతంత్ర్య సమరయోఢుడు కొత్త కేశవులు ఈ మండలమునకు చెందినవారు. ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా ఈ మండలం మీదుగా వెళ్ళినారు. మండలకేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉంది.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున బాలానగర్ మండలము, ఈశాన్యమున కేశంపేట మండలము, తూర్పున మిడ్జిల్ మండలము, దక్షిణమున తిమ్మాజీపేట, భూత్పూర్ మండలములు, పశ్చిమాన మహబూబ్ నగర్ మండలము, వాయువ్యాన నవాబ్ పేట మండలము సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 102557. ఇందులో పురుషులు 51440, మహిళలు 51117. అక్షరాస్యుల సంఖ్య 61056. మండలంలో పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
రవాణా సౌకర్యాలు
7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున దేవరకొండ, నల్గొండ వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో సికింద్రాబాదు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. చరిత్ర: జడ్చర్ల మండలానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఆదిమానవుల ఉనికి లభించిన ఆవులవానిపల్లి (నేటి ఆల్వాన్‌పల్లి), రాష్ట్రంలోనే అతి పురాతనమైన కట్టడం గొల్లత్తగుడి ఈ మండలంలోనే ఉన్నాయి. గౌతమబుద్ధుడు, వర్థమాన మహావీరుడు లాంటివారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. గొల్లత్తగుడిలో లభించిన మహావీరుని తలలేని విగ్రహం పిలలమర్రి పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. గంగాపూర్ కళ్యాణి చాళుక్యుల కాలంలో ఉప రాజధానిగా పనిచేసింది. పురాణాలలో కూడా గంగాపూర్ వర్ణన ఉంది. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణంను గోనబుద్ధారెడ్డి బాదేపల్లి ఆలయంలో రచించినట్లుగా ఆధారాలున్నాయి. కాకతీయులు వర్థమానపురంపై దండెత్తినప్పుడు జడ్చర్ల సమీపంలోని బూదపురం (ఇప్పటి భూత్పూర్)లో పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు జడ్చర్ల కూడా కందూరు చోడుల రాజ్యంలో భాగంగా ఉండేది. జాతీయ రహదారి ఏర్పడక ముందు నుంచే జడ్చర్ల ప్రధాన రహదారిపై ఉంది. ఏనుగుల వీరస్వామి కూడా మద్రాసు (చెన్నై) నుంచి కాశీ యాత్ర చేసే సమయంలో జడ్చర్ల మీదుగా యాత్ర కొనసాగించాడు. సెప్టెంబరు 17, 1948న నిజాం పాలన నుంచి విమోచన అనంతరం 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1946-48 కాలంలో ఈ ప్రాంతంలో విమోచన పోరాటం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. మండలానికి చెందిన పలువులు పోరాటయోధులు ఉద్యమంలో పాల్గొన్నారు. 2011లో 42 రోజల పాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. జూన్ 2, 2014న తెలంగాణలో భాగమైంది.
ఈ మండలము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006-11 కాలంలో నిత్యానంద మండల అధ్యక్షులుగా పనిచేశారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: మండలంలో 104 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 80 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 22 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 14 ప్రాథమికోన్నత పాఠశాలలు (5 మండల పరిషత్తు, 9 ప్రైవేట్), 33 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 13 జడ్పీ, 1 పైవేట్ ఎయిడెడ్, 17 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 4 జూనియర్ కళాశాలు (2 ప్రభుత్వ, 2 ప్రైవేట్) ఉన్నవి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 30995 హెక్టార్లలో 35% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. వరి, కందులు, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది మండల ప్రత్యేకతలు:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
జడ్చర్ల మండలము (Jadcherla Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి