(ఇది మేడ్చల్ జిల్లా బాలానగర్ మండల వ్యాసము. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కోసం ఇక్కడ చూడండి) బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉంది. మండల పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి. బేగంపేట విమానాశ్రయం ఈ మండలంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కుత్బుల్లాపూర్ మండలం, ఈశాన్యాన ఆల్వాల్ మండలం, వాయువ్యాన కూకట్‌పల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన హైదరాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 371345. ఇందులో పురుషులు 166327, మహిళలు 151018. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 567320. ఇందులో పురుషులు 291904, మహిళలు 275416.మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. రాజకీయాలు: రాజకీయాలు: ఈ మండలం కూకట్‌పల్లి మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉంది. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం పరిధిలోనూ, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఉనాయి. గ్రేటర్ హైదరాబాదులో బాలానగర్ 120వ వార్డులో భాగంగా ఉంది. మండలంలోని గ్రామాలు:
Balanagar, Ferozguda, Zinkalawada, Fathenagar, Old bowenpally, Hasmathpet, Begumpet, Babbuguda
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .బాలానగర్ (Balanagar) : బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది హైదరాబాదు నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో 120వ వార్డులో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. బేగంపేట (Begumpet ): బేగంపేట మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలోనే ఒక ముఖ్యమైన ప్రాంతము. 6వ నిజాం మహబూబ్‌అలీఖాన్ కూతురు బషీర్ ఉన్నీసా బేగం పేరిట దీనికి ఈ పేరు వచ్చింది. బేగంపేటలో విమానాశ్రయం ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమయ్యే వరకు ఇది హైదరాబాదు విమానాశ్రయంగా పనిచేసింది. సికింద్రాబాదు-వాడి మార్గంలో బేగంపేటలో రైల్వేస్టేషన్ ఉంది. ఫతేనగర్ (Fateh Nagar): ఫతేనగర్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు అధికంగా ఉన్నాయి. ఫతేనగర్‌లో MMTS రైల్వేస్టేషన్ ఉంది. హష్మత్‌పేట్ (Hasmathpet) : హష్మత్‌పేట్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలో (సికింద్రాబాదు) భాగంగా ఉంది. చారిత్రక హష్మత్‌పేట్ కైరన్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బాన్ చెరువు పేరిట ఒక పెద్ద చెరువు కూడా ఉంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా ఈ చెరువులో చేస్తారు. ఓల్డ్ బోయిన్‌పల్లి (Old bowenpally): ఓల్డ్ బోయిన్‌పల్లి మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది జంటనగరాలలో సికింద్రాబాదు పరిధిలోకి వస్తుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. చాళుక్య త్రైలోక్య త్రిభువనమల్ల పేరిట దీనికి భువనపల్లి పేరు వచ్చింది. క్రమేణా బోయిన్‌పల్లిగా మారింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Balanagar Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి