జోగులాంబ గద్వాల జిల్లా (నడిగడ్డ) రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించారు. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. అరుణ తండ్రి మరియు సోదరుడు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ 2004లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ 2009లో రెండో సారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. 2014లో గద్వాల నుంచి మూడోసారి గెలుపొందారు. 2019 శాసనసభ ఎన్నికలలో తెరాస అభ్యర్థి చేతిలో ఓడిపోయి 2019 లోక్‌సభ ఎన్నికలలో భాజపా తరఫున మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సెప్టెంబరు 2020లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైనారు. బాల్యం, కుటుంబం డి.కె.అరుణ 1960, మే 4న మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో జన్మించారు. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నారాయణపేటలో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించారు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించారు. భర్త డి.కె.భరతసింహారెడ్డి, మామ డి.కె.సత్యారెడ్డి, బావ (భర్త అన్న) డి.కె.సమర సింహారెడ్డి లు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. డి.కె.సమరసింహారెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. రాజకీయ జీవితం డి.కె.అరుణ 1996లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1998లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందినారు. ఆ అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసిననూ విజయం దక్కలేదు. 2001లో పాన్‌గల్ జడ్పీటీసిగా ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున గద్వాల నుంచి పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గెలిచిననూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగారు. దీనితో ఫిబ్రవరి 2007లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినారు. గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అరుణకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం. 2009 ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరఫున ఇద్దరికి స్థానం లభించగా డి.కె.అరుణకు చిన్నతరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖా మంత్రిపదవి లభించింది. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి గద్వాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున మరోసారి గద్వాల నుంచి పోటీచేసి తెరాస అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో పరాజయం చెందారు. మారిన పరిస్థితుల కారణంగా 2019 ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో భాజపా తరఫున మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సెప్టెంబరు 2020లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైనారు.
(గమనిక: ఈ సమాచారం 26-09-2020 నాటికి తాజాకరించబడింది)
|
27, జనవరి 2013, ఆదివారం
డి.కె.అరుణ (D.K.Aruna)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి