24, జనవరి 2013, గురువారం

మహబూబ్ నగర్ మండలము (Mahabubnagar Mandal)

జిల్లా మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్ మహబూబ్ నగర్
జనాభా249006 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమహబూబ్ నగర్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలుపిల్లలమర్రి
ముఖ్య పంటలువరి
మండల ప్రముఖులుపల్లెర్ల హన్మంతరావు
మహబూబ్ నగర్ జిల్లాలోని 64 మండలాలలో ఒకటి. ఈ మండలంలో పురపాలక సంఘం మరియు 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి.  లెక్కల ప్రకారం మండల జనాభా 249006. మండల కేంద్రం సమీపంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి ఉంది. హైదరాబాదు-రాయచూరు రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున హన్వాడ, నవాబ్ పేట మండలములు, తూర్పున జడ్చర్ల మండలము, దక్షిణమున భూత్పూర్ మండలము, పశ్చిమాన కోయిలకొండ మండలము సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 249006. ఇందులో పురుషులు 125656, మహిళలు 123350. పట్టణ జనాభా 210143, గ్రామీణ జనాభా 38863. జనాభాలో ఇది జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 78.56%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు-రాయచూరు రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి మండలం సమీపం నుంచి వెళ్తుంది. నూతనంగా ప్రకటించబడిన రాయచూరు-జడ్చర్ల రహదారి మండల కేంద్రం గుండా వెళ్తుంది.

రాజకీయాలు:
ఈ మండలం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. జడ్పీటీసి సభ్యులుగా 1996లో రాజేశ్వర్ గౌడ్ (జనరల్), 2001లో వసంత (బీసి మహిళ), 2006లో తెలుగుదేశం పార్టీకి చెందిన కె.శేఖర్ నాయక్ (ఎస్టీ జనరల్) ఎన్నికయ్యారు. 2014లో ఎంపిపిగా భాజపాకు చెందిన సావిత్రి ఎన్నికయ్యారు.

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో
మహబూబ్‌నగర్ మండల స్థానం (గులాబి రంగు)
(పటంలో పేరు తప్పు పడింది)
విద్యాసంస్థలు:
మండలంలో 137 ప్రాథమిక పాఠశాలలు (35 ప్రభుత్వ, 56 మండల పరిషత్తు, 6 ప్రైవేట్ ఎయిడెడ్, 40 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 29 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 19 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 82 ఉన్నత పాఠశాలలు (19 ప్రభుత్వ, 10 జడ్పీ, 4 పైవేట్ ఎయిడెడ్, 49 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 19 జూనియర్ కళాశాలలు (4 ప్రభుత్వ, 15 ప్రైవేట్) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 23048 హెక్టార్లలో 21% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 18% భూమి అటవీ ప్రాంతంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. జొన్నలు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 716 మిమీ. మండలంలో సుమారు 1700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2013, మే 18: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన లైటు ఆంజనేయులు మరణించారు. 
  • 2014, జూలై 4: ఎంపిపిగా భాజపాకు చెందిన సావిత్రి ఎన్నికయ్యారు.

  విభాగము: మహబూబ్‌నగర్ మండలంలోని రెవెన్యూ గ్రామాలు
  1. అల్లీపూర్ (Allipur),
  2. అప్పాయిపల్లి (Appaipall),
  3. బోయపల్లి (Boyapalle),
  4. ధర్మాపూర్ (Dharmapur),
  5. ఫతేపూర్ (Fathepur),
  6. జానప్పపల్లి (Jannappapalli), నిర్జనగ్రామము
  7. కదూర్ (Kadur),
  8. కోటకదిర (Kotakadira),
  9. మాచన్‌పల్లి (Machanpalli),
  10. మహబూబ్‌నగర్ గ్రామీన (Mahbubnagar-Rural),
  11. ఓబ్లాయిపల్లి (Oblaipalli),
  12. పాలకొండ (Palakonda),
  13. రామచంద్రాపూర్ (Ramchandrapur),
  14. వెంకటాపూర్ (Venkatapur),
  15. ఎదిర (Yedira),
  16. ఏనుగొండ (Yenugonda),
  17. ఎర్రవల్లి (Yerravalli),
  18. జైనల్లిపూర్ (Zainallipur),
  19. జమిస్తాపూర్ (Zamistapur),


హోం,
విభాగాలు:
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  మహబూబ్‌నగర్ మండలము, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక