కోయిలకొండ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. మండల కేంద్రం కోయిలకొండలో పురాతనమైన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇది జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమండలము మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.మండలకేంద్రంలో శ్రీరామక్షేత్రం, 3 కిమీ దూరంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఉన్నాయి. 2014 & 2018లో నారాయణపేట నుంచి శాసనసభకు ఎన్నికన సుంకి రాజేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున హన్వాడ మండలము, తూర్పున మహబూబ్‌నగర్ మండలము, దక్షిణమున దేవరకద్ర, ధన్వాడ మండలములు, పశ్చిమాన నారాయణపేట, మద్దూరు మండలములు, వాయువ్యాన కొంతవరకు రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710.
జనాభా
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 56389. ఇందులో పురుషులు 28487, మహిళలు 27902. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710. ఇందులో పురుషులు 33852, మహిళలు 32858. అక్షరాస్యుల సంఖ్య 30047. రవాణా సౌకర్యాలు: కోయిలకొండ ప్రధానరహదారిపై లేకున్ననూ జిల్లా కేంద్రం సమీపంలో ఉండుటచే ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కోయిలకొండ నుంచి మద్దూరు, దేవరకద్ర వెళ్ళుటకు కూడా రహదారులున్నాయి రాజకీయాలు: ఈ మండలము నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనసూయమ్మ, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన జంగం విద్యాసాగర్ ఎన్నికయ్యారు.
2008-09 నాటికి మండలంలో 70 ప్రాథమిక పాఠశాలలు (69 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 14 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 7 ప్రైవేట్), 11 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 9 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది.
వ్యవసాయం, నీటిపారుదల
మండలం మొత్తం విస్తీర్ణం 24636 హెక్టార్లలో 33% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట జొన్నలు. వరి, వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 624 మిమీ. మండలంలో సుమారు 3300 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
సంఘటనలు
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
కోయిలకొండ మండలము (Koilkonda Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి