24, జనవరి 2013, గురువారం

తలకొండపల్లి మండలము (Talakondapally Mandal)

జిల్లా రంగారెడ్డి
రెవెన్యూ డివిజన్ కందుకూరు
జనాభా49236 (2001)
52737 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకల్వకుర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుప్రత్తి
మండల ప్రముఖులుజైపాల్ యాదవ్,
తలకొండపల్లి రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ మండలంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. ప్రముఖ సమరయోధుడు, రచయిత మందుముల నరసింగరావు, సమరయోధుడు మందుముల రామచంద్రారావు మండల కేంద్రానికి చెందినవారు. కల్వకుర్తి నుంచి 2 సార్లు ఎన్నికైన జైపాల్ యాదవ్ ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలము కందుకూరు రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలున్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52737. అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలోకి చేరింది.

సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన కడ్తాల్ మండలం, తూర్పున ఆమనగల్ మండలం, వాయువ్యాన కేశంపేట మండలం, దక్షిణాన నాగర్‌కర్నూల్ జిల్లా, పశ్చిమాన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49236. ఇందులో పురుషులు 25152, మహిళలు 24084.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52737. ఇందులో పురుషులు 26993, మహిళలు 25744. జనాభాలో ఇది జిల్లాలో 37వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
షాద్ నగర్ నుంచి ఆమనగల్ వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. తలకొండపల్లి నుంచి కల్వకుర్తి వరకు కూడా రహదారి సౌకర్యం ఉంది

రాజకీయాలు:
ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్.పంతూనాయక్, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి.నర్సింహ ఎన్నికయ్యారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో
తలకొండపల్లి మండల స్థానం (ఎరుపు రంగు)

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 30392 హెక్టార్లలో 40% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి. వరి, మొక్కజొన్న, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 617 మిమీ. మండలంలో సుమారు 5200 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తలకొండపల్లి స్థానం
మండలంలోని గ్రామాలు:
Antharam, Badnapur, Chandradana, Cheepunuthala, Chennaram, Chukkapur, Garvipalle, Gattu Ippalapalle , Julapalle, Khanapur, Lingarapalle, Medakpalle, Padakal, Rampur, Seriramakrishnapu, Talakondapalle, Veljala, Veljala, Venkatapurpatti , Venkatraopeta, Yadavalli 
 
 
ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
రంగారెడ్డి జిల్లా మండలాలు,   తలకొండపల్లి మండలము,   కందుకూరు రెవెన్యూ డివిజన్,   కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • 50 సంవత్సరాల హైదరాబాదు (రచన- మందుముల నరసింగరావు),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు), 
  • చరితార్థులు మన తెలుగు పెద్దలు (రచన- మల్లాది కృష్ణానంద్), 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు GO. Ms. No. 250: Date: 11.10.2016
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక