13, మే 2013, సోమవారం

చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Chennur Assembly Constituency)

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. తూర్పు ఆదిలాబాదు భాగంలో కల ఈ నియోజకవర్గం జిల్లా రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ నుండి విజయం సాధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడ నుండి వరుసగా 4 సార్లు గెలుపొందినారు. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు
2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం చెన్నూర్ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. ఇది వరకు ఉన్న వేమనపల్లి మండలం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిసింది.
  • జైపూర్
  • చెన్నూర్‌
  • కోటపల్లి
  • మందమర్రి

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ చంద్రయ్య ఇండిపెండెంట్
1967 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ రాజమల్లయ్య ఇండిపెండెంట్
1972 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
1978 సి.నారాయణ కాంగ్రెస్ పార్టీ వి.ప్రభాకర్ జనతా పార్టీ
1983 ఎస్.సంజీవరావు తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ
1985 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ
1989 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కోదాటి ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ
1994 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ ఎస్.సంజీవరావు కాంగ్రెస్ పార్టీ
1999 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ గడ్డం వినోద్‌ కాంగ్రెస్ పార్టీ
2004 గడ్డం వినోద్‌ కాంగ్రెస్ పార్టీ బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ
2009 నల్లాల ఓదెయ్య తెలుగుదేశం పార్టీ గడ్డం వినోద్‌ కాంగ్రెస్ పార్టీ
2010* నల్లాల ఓదెయ్య తెరాస గడ్డం వినోద్‌ కాంగ్రెస్ పార్టీ
2014 నల్లాల ఓదేలు తెరాస గడ్డం వినోద్‌ కాంగ్రెస్ పార్టీ
2018 బాల్క సుమన్ తెరాస వెంకటేశ్ నేత బొర్లకుంట కాంగ్రెస్ పార్టీ

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నల్లాల ఓదేలు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వినోద్‌పై 26164 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున బాల్క సుమన్, భాజపా తరఫున అందుగుల శ్రీనివాసులు, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్ నేత పోటీచేశారు. తెరాసకు చెందిన బాల్క సుమన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్ నేత బొర్లకుంట పై 28132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
విభాగాలు: ఆదిలాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక