24, మే 2019, శుక్రవారం

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నలమద (Nalamada Uttam Kumar Reddy)

జననంజూన్ 20, 1962
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఎంపి,
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నలమద ఉత్తమ్‌ కుమార్ రెడ్డి జూన్ 20, 1962న సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం తాటిపాముల గ్రామంలో జన్మించారు. ప్రారంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ ప్లైలెట్‌గా పనిచేసిన ఉత్తం కుమార్ తర్వాత రాజకీయాలలో చేరి ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
1994లో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తొలిసారిగా 1999లో కోదాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2004లో కోదాడ నుంచి, 2009లో హుజూర్‌నగర్ నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నిర్వహించిన ఆల్‌పార్టీ మీటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరయ్యారు. 2015లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉత్తం కుమార్ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 మరియు 2018లలో కూడా హుజూర్‌నగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికలు (2020)లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తర్వాత రాజీనామా చేశారు.

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కూడా 2014లో శాసనసభకు ఎన్నికైనారు. 2014లో కోదాడ నుంచి ఎన్నికైన పద్మావతి 2018లో కూడా అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.


ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: 17వ లోక్‌సభ సభ్యులు, సూర్యాపేట జిల్లా రాజకీయ నాయకులు, 


 = = = = =


Tags: about N.Uttam Kumar Reddy Biography Congress leader Telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక