2, జూన్ 2013, ఆదివారం

సంగం లక్ష్మీబాయి (Sangam Laxmibai)

 సంగెం లక్ష్మీబాయమ్మ
(1911-1979)
జననంఘట్ కేసర్
జూలై 27, 1911
జిల్లామేడ్చల్
పదవులురాష్ట్ర మంత్రి, ఎంపి,
మరణంజూన్ 2, 1979
సంగెం లక్ష్మీబాయమ్మ నిజాం వ్యతిరేక పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, మహిళా సంక్షేమం, రాజకీయాలలో పేరుగాంచారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని ఒక కుగ్రామంలో జూలై 27, 1911న జన్మించిన లక్ష్మీబాయి అసలు పేరు సత్యవతి. వివాహానంతరం అత్తవారు లక్ష్మీబాయి అని పేరుపెట్టారు. చిన్న వయస్సులోనే వివాహం కావడం, తల్లిదండ్రులు, భర్త చనిపోవడంతో లక్ష్మీబాయి అనాథగా మారింది. మద్రాసు ఆంధ్రకళాశాలలో చదువుకునే అవకాశం లభించింది. తర్వాత తిగిరి హైదరాబాదు చేరి నారాయణగూడలోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి మహిళా కళాశాల హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూ స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకుంది. 
 
స్వామి రామానందతీర్థ ఆధ్వర్యంలో సాగుతున్న నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ముఖ్య పాత్ర వహించింది. 1932లో శాసనోల్లంఘనలో పాల్గొని అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. 1947-48లో విమోచనోద్యమంలోనూ పాల్గొన్నారు. 
 
హైదరాబాదు విమోచన అనంతరం సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1952లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై హైదరాబాదు రాష్ట్ర విద్యాశాఖ ఉపమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఫిబ్రవరు 1954 నుంచి అక్టోబరు 1956 వరకు పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు "నా అనుభవాలు" పేరిట పుస్తకాన్ని రచించారు. మహిళా విద్య, అనాథ బాలిక సంక్షేమంకై 1952లో ఇందిరాసేవాసదన్ స్థాపించింది. 
 
వినోబాభావే భూదానోద్యమంలో పాల్గొని అనేక గ్రామాలు తిరిగి దాతల నుంచి భూములను సేకరించారు. 1958లో ఎం.సి.హెచ్.స్కూల్ స్థాపించారు. 1957, 1962, 1967లలో వికారాబాదు, మెదక్ నియోజకవర్గాల నుంచి లోకసభకు ఎన్నికైనారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభకు ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఉద్యమాలలో, రాజకీయాలలో, అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రజలచే మన్నలలు పొందిన లక్ష్మీబాయమ్మ జూన్ 2, 1979లో మరణించారు.
 
ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా ప్రముఖులు, తెలంగాణ ప్రముఖ మహిళలు,


 = = = = =

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక