22, ఆగస్టు 2016, సోమవారం

మేడ్చల్ జిల్లా (Medchal District)

మండలాలు15
రెవెన్యూ డివిజన్లు2
వైశాల్యం1084
జనాభా2440073
రెవెన్యూ గ్రామాలు
163
గ్రామపంచాయతీలు
61
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా గుండా 3 జాతీయ రహదారులు, 3 రైల్వే మార్గాలు వెళ్ళుచున్నాయి. 

చారిత్రకమైన త్రేతాయుగం నాటి శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈ జిల్లాలో ఉంది. సమరయోధురాలు సంగెం లక్ష్మీబాయమ్మ, వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉమావెంకట్రాంరెడ్డి ఈ జిల్లాకు చెందినవారు.

మేడ్చల్ జిల్లాలో చాలా భాగం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. అంతేకాకుండా జిల్లాలో 4 నగరపాలక సంస్థలు (పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్), 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

మండలాలు:
మేడ్చల్, షామీర్‌పేట్, కీసర, కాప్రా, ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, దుండిగల్ గండిమైసమ్మ, బాచుపల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, మూడుచింతలపల్లి.
 
చరిత్ర:
సెప్టెంబరు 17, 1948న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాదు జిల్లాలో భాగంగా హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన పిదప 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయంలో ఈ ప్రాంతం అప్పుడు కొత్తగా అవతరించిన రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె జయప్రదమైంది. జూన్ 2, 2014లో ఈ ప్రాంతం కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో రంగారెడ్డి జిల్లా నుంచి విడదీసిన 14 మండలాలతో మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. మార్చి 2019లో శామీర్‌పేట మండలాన్ని విభజించి మరో మండలాన్ని (మూడుచింతలపల్లి మండలం) ఏర్పాటుచేశారు. 

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం,  కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు-వాడి మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. 7వ నెంబరు (కొత్తపేరు 44), 9వ నెంబరు మరియు 202 నెంబరు జాతీయ రహదారులు కూడా జిల్లాపై నుంచి వెళ్తున్నాయి.
 
రాజకీయాలు:
మేడ్చల్ జిల్లాకు చెందిన మండలాలు మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తాయి.


ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,


 = = = = =


1 కామెంట్‌:

  1. దిక్కుమాలిన నిర్ణయం. ఇన్ని జిల్లాలు అవసరమా. కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక