ఘట్‌కేసర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 మరియు సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం వెళ్ళుచున్నవి. సంగెం లక్ష్మీబాయమ్మ, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 1978 వరకు హైదరాబాదు జిల్లాలో, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో కొనసాగిన ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కీసర మండలం, పశ్చిమాన మేడిపల్లి మండలం, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జాతీయ రహదారి నెం.202 మరియు సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం జిల్లా గుండా వెళ్తున్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 88935. ఇందులో పురుషులు 45926, మహిళలు 43009. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 188700. ఇందులో పురుషులు 75710, మహిళలు 73055. అక్షరాస్యుల సంఖ్య 124280. పట్టణ జనాభా 138252, గ్రామీణ జనాభా 50448. రాజకీయాలు: ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. ఘట్‌కేసర్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Ankushapur, Annojiguda, Aushapur, Badesahebguda, Edulabad, Ghatkesar, Ismailkhanguda, Kachwanisingaram, Kondapur, Korremul, Madharam, Majarguda, Marpallyguda, Muthawalliguda, Narepally, Padamatisaiguda, Pocharam, Prathapsingaram, Yamnampet
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .ఏదులాబాదు (Edulabad): ఏదులాబాదు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలానికి చెందిన గ్రామము. ఏదులాబాదు చెరువు మండలంలోనే పెద్దది. దీనిలోకి మూసి, ఎరిమల్లేవాగు నీరు కలుస్తుంది. 2వేల ఎకరలకు నీరు అందిస్తుంది. చెరువులో చేపలుపట్టే 500 కుటుంబాలు జీవనోపాధి పొందుచున్నాయి. ఘట్‌కేసర్ (Ghatkesar) : ఘట్‌కేసర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. హైదరాబాదు శివారులో, మరియు HMDAలో భాగంగా ఉంది. సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన సంగెం లక్ష్మీబాయమ్మ ఈ గ్రామానికి చెందినవారు. కొర్రెముల (Korremula) : కొర్రెముల మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఔటర్ రింగ్‌రోడ్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళుచున్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. మాదారం (Madaram): మాదారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. పోచారం (Pocharam): పోచారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతము మరియు సమీపంలో సింగపూర్ టౌన్‌షిప్, ఇన్ఫోసిస్ కార్యాలయం ఉన్నాయి. విశాలమైన స్థలంలో చెరువు ప్రక్కన స్పటికలింగేశ్వర ఆలయాన్ని గ్రామస్థులు నిర్మించుకున్నారు. గుజరాత్ నుంచి తెప్పించి ప్రతిష్టించిన స్పటికలింగం దక్షిణ భారతదేశంలోనే పెద్దది. యనంపేట (Yanampet): యనంపేట మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 500 సంవత్సరాల చరిత్ర కల పురాతనమైన శ్రీరంగనాయక, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ghatkesar Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి