భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ జూన్ 12, 1946న హైదరాబాదులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొంది రాజకీయాలలో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 4 సార్లు సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనారు. అటల్ బిహారీ వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 22014-17 కాలంలో నరేంద్రమోడి మంత్రివర్గంలో పనిచేశారు. 2019 సెప్టెంబరులో దత్తన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు
రాజకీయ ప్రస్థానం: 1980లో భాజపా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనారు. 1981-89 కాలంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. బండారు దత్తాత్రేయ తొలిసారిగా 1991లో సికింద్రాబాదు స్థానం నుంచి భాజపా తరఫున లోకసభకు ఎన్నికైనారు. 1996-98 కాలంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1998 మరియు 1999లలో కూడా ఇదే స్థానం నుంచి భాజపా తరఫున విజయం సాధించడమే కాకుండా రెండు సార్లు కేంద్ర మంత్రిమండలిలో స్థానం పొందారు. దత్తాత్రేయ భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా, కిషన్ రెడ్డి కంటె ముందు రాష్ట్ర భాజపా అధ్యక్షపదవిని నిర్వహించారు.కేంద్రంలో పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. 2014లో సికింద్రాబాదు నుంచి మరోసారి ఎన్నికైనారు. 2014, నవంబరు 9న కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నరేంద్రమోడి మంత్రివర్గంలో స్థానం పొంది 2017 వరకు పనిచేశారు. 2019 సెప్టెంబరులో దత్తన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు .
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
1, సెప్టెంబర్ 2019, ఆదివారం
బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి