16, సెప్టెంబర్ 2013, సోమవారం

బషీరుద్దీన్ బాబూఖాన్ (basheeruddin babu khan)

 బషీరుద్దీన్ బాబూఖాన్
జననంసెప్టెంబర్ 20, 1941
స్వస్థలంపోచారం
పదవులురాష్ట్ర మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గం బోధన్ అ/ని,
మరణంసెప్టెంబరు 15, 2013
బషీరుద్దీన్ బాబూఖాన్ నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బాబూఖాన్ నిజామాబాదు జిల్లా ఎడవల్లి మండలం పోచారం గ్రామానికి చెందినవారు. సెప్టెంబర్ 20, 1941న జన్మించిన బాబూఖాన్ నిజాం ప్రభువు వంశానికి చెందినవారు. బషీరుద్దీన్ బాబూఖాన్ తాతగారు బోధన్‌లో నిజాం చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు. 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా ఎన్టీరామారావు మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో పార్టీ టికెట్ లభించలేదు. 1994లో మరోసారి బోధన్ నుంచే పోటీచేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో స్థానం పొంచారు. 1998లో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో బాబూఖాన్ మంత్రిపదవికి రాజీనామా సమర్పించారు. 1999లో పార్టీ టికెట్ లభించలేదు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సెప్టెంబరు 15, 2013న మరణించారు.


విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం, ఎడవల్లి మండలము, 8వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 2013లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక