15, సెప్టెంబర్ 2013, ఆదివారం

కె.శుక్రవర్థన్ రెడ్డి (K.Shukravardhan Reddy)

కె.శుక్రవర్థన్ రెడ్డి
జననంజూలై 15, 1959
స్వగ్రామంనాగారం
హోదాసహాయ ఆడిటు అధికారి
కొత్తకాపు శుక్రవర్థన్ రెడ్డి 1959లో రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామంలో జన్మించారు. వికారాబాదు, తాండూరులలో కళాశాల విద్య అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ, ఎంఎడ్ పూర్తిచేశారు. ప్రారంభంలో విడిఓగా కొంతకాలం ఉద్యోగం చేసి, ఆ తర్వాత ఉపాధ్యాయులుగా మూడేళ్ళు విధులు నిర్వహించి 1992 నుంచి రాష్ట్ర ఆడిటు శాఖలో సీనియర్ ఆడిటరుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ, ఫిబ్రవరి 2014లో సహాయ ఆడిటు అధికారిగా పదోన్నతి పొందారు.

శుక్రవర్థన్ రెడ్డి అభ్యసన దశలోనే కళాశాల ఎన్నికలలో సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షులుగా ఎన్నికైనారు. 2007-10 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగసంఘం మహబూబ్‌నగర్ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. 2008 నుంచి ఇప్పటివరకు ఉద్యోగసంఘం తెలంగాణ శాఖ ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 15, 2013 నాడు జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం పొందారు.

బాల్యం, విద్యాభ్యాసం:
శుక్రవర్థన్ రెడ్డి జూలై 15, 1959న రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం నాగారం గ్రామంలో జన్మించారు. 7వ తరగతి వరకు స్థానికంగా అభ్యసించి తాండూరు, వికారాబాదులలో హైస్కూలు విద్య పూర్తిచేశారు. ఇంటర్మీడియట్ వికారాబాదులోని శ్రీఅనంత పద్మనాభ కళాశాల నుంచి, డిగ్రీ 1983లో తాండూరులోని పీపుల్స్ కళాశాల నుంచి పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ (రాజనీతిశాస్త్రం), బీఎడ్, ఎంఎడ్ పట్టాలు పొందారు. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు కళాశాల జాయింట్ సెక్రెటరీగా, డిగ్రీలో ఉన్నపుడు కళాశాల అధ్యక్షులుగా ఎన్నికైనారు.

ఉద్యోగ బాధ్యతలు:
శుక్రవర్థన్ రెడ్డి తొలిసారిగా 1989లో గ్రామ అభివృద్ధి అధికారిగా సంగారెడ్డి జిల్లా పరిషత్తులో కొన్నాళ్ళు విధులు నిర్వహించి, ఆ వెంటనే ఉపాధ్యాయులుగా నియమితులైనారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని కందాడలో 1989-92 వరకు పనిచేసి, 1992 జూలైలో రాష్ట్ర ఆడిటు శాఖలో సీనియర్ ఆడిటరుగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. కళాశాల దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న శుక్రవర్థన్ రెడ్డి 2007-10 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగసంఘం మహబూబ్‌నగర్ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఉండగా, 2008 నుంచి ఇప్పటివరకు ఉద్యోగసంఘం తెలంగాణ శాఖ ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 

గుర్తింపులు:
2013 స్వాతంత్ర్య దినోత్సవం నాడు జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం పొందారు.విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, ధరూర్ మండలం, 1959లో జన్మించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక