తెలంగాణ సాయుధ పోరాటంలో, రాజకీయాలలో పేరుగాంచిన బద్దం ఎల్లారెడ్డి 1906లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో జన్మించారు.1930 నుంచే కమ్యూనిజం వైపు ఆకర్షితులైనారు. 1938లో సత్యాగ్రాహానికి పూనుకున్నారు. 1939లో కమ్యూనిస్టు పార్టీ హైదరాబాదులో శాఖను ప్రారంభించగా దానిలో రావి నారాయణరెడ్డి లాంటి వారితో కలిసి బద్దం ఎల్లారెడ్డి పనిచేశారు. 1941లో ఎల్లారెడ్డి ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికోబడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించారు. తర్వాత రాజకీయాలలో చేరి లోకసభకు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1978 డిసెంబరు 27న మరణించారు.
ఉద్యమాలు: ఎల్లారెడ్డి విద్యార్థి దశలోనే పోరుబాట పట్టారు. 1930లో కాకినాడ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని 7 మాసాలు జలిశిక్షకు గురయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో అగ్రనాయకులలో ముఖ్యులుగా మారారు. సాయుధ పోరాట కాలంలోనూ అరెస్ట్ అయి 3 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించారు. రాజకీయ ప్రస్థానం: యుక్తవయస్సు నుంచే కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన ఎల్లారెడ్డి 1952లో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పి.వి.నరసింహరావుపై విజయం సాధించారు. 1956లో సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులయ్యారు. 1958లో బుగ్గారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1964లో రాజ్యసభకు ఎన్నికైనారు. 1972లో ఇందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో రెండోసారి ప్రవేశించారు. గుర్తింపులు: 2006లో కరీంనగర్‌లో ఆయన విగ్రహం ప్రతిష్టించబడింది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
14, జనవరి 2014, మంగళవారం
బద్దం ఎల్లారెడ్డి (Baddam Yella Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి