తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. సీహెచ్ విద్యాసాగర్ రావు, కె.చంద్రశేఖర్ రావులు కేంద్రమంత్రులుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన బండి సంజయ్ కుమార్ ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2004 ఎన్నికలు:
2004 లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితోనూ, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతోనూ పొత్తు కుదుర్చుకున్నందున తెరాస తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, భాజపా తరఫున సి.హెచ్.విద్యాసాగర్ రావులు పోటీపడ్డారు. హోరాహోరీగా జరిగిన పోరులో కె.చంద్రశేఖరరావు 1,31,168 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇంతకు క్రితం రెండు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావుకు రెండో స్థానం లభించింది.
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వెలిచాల రాజేందర్ మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పోటీచేశారు. తొలుత కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావును ఇక్కడి నుండి పోటీ చేయించాలనుకున్ననూ చివరి దశలో సిరిసిల్ల అసెంబ్లీ టికెట్టు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పై 50243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పొన్నం ప్రభాకర్‌కు 317927 ఓట్లు రాగా, వినోద్ కుమార్‌కు 267684 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వి.రాజేంద్రప్రసాద్ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీహెచ్ జంగారెడ్డి 4వ స్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 20 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఒకరు నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 17 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి బోయినపల్లి వినోద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన పొన్నం ప్రభాకర్‌పై 204652 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలలో ఈ స్థానం నుంచి భాజపాకు చెందిన బండి సంజయ్ కుమార్ సంచలన విజయం సాధించారు. అంతకుక్రితం 2014, 2018లలో శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందిన బండి సంజయ్ ఈ సారి సిటింగ్ ఎంపి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ పై 87508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. బండి సంజయ్‌కు 498276 ఓట్లు రాగా వినోద్ కుమార్ కు 408768 ఓట్లు లభించాయి.
= = = = =
|
13, జూన్ 2013, గురువారం
కరీంనగర్ లోకసభ నియోజకవర్గం (Karimnagar Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి