ఒడిషా భారతదేశ తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. ఒడిషా రాష్ట్ర వైశాల్యం 1,55,820 చ.కి.మీ.మరియు 2011 ప్రకారం జనాభా 3,67,06,920. 2011కు ముందు ఈ రాష్ట్ర నామం ఒరిస్సా. రాష్ట్ర అధికార భాష ఒరియా, రాష్ట్ర రాజధాని మరియు పెద్ద నగరం భువనేశ్వర్. రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నది మహానది. పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్, చిల్కా సరస్సు ఒడిషాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఇక్కడి ప్రధాన నృత్యం ఒడిస్సీ. రూర్కెలాలో ఉక్కు కర్మాగారం, భువనేశ్వర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మహానదిపై హీరాకుడ్ ప్రాజెక్టు ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఒడిషా రాష్ట్రం భారతదేశ తూర్పు తీరానా బంగాళాఖాతం సరిహద్దున ఉంది. ఈ రాష్ట్రానికి ఉత్తరాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమబెంగాల్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర తూర్పుభాగంలో తూర్పుకనుమలు ఉన్నాయి. చరిత్ర: క్రీ.శ.3వ శతాబ్దిలో అశోక చక్రవర్తి చేసిన కళింగయుద్ధం ప్రస్తుత ఒడిషా రాష్ట్రంలో ఉంది. మౌర్యుల తర్వాత కుషానులు, శాతవాహనులు, గుప్తులు, తూర్పుగాంగులు, గజపతులు, మొఘలులు, మరాఠాలు, బ్రిటీష్ వారు పాలించారు. ఈ ప్రాంతం వివిధ కాలాలలో వివిధ రకాలుగా పిల్వబడింది. కళింగ, ఉత్కళ, ఓడ్ర, ఉండ్ర, చేది, తోసలిగా పిల్వబడి ఒరిస్సాగా స్థిరపడింది. 2011లో ఒడిషాగా పేరుమార్చబడింది. వివిధ రాజవంశస్థులు నిర్మించిన ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. రాజకీయాలు: ఒడిషాలో 21 లోక్‌సభ స్థానాలు, 10 రాజ్యసభ స్థానాలు, 147 విధానసభ స్థానాలున్నాయి. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు బిజూ జనతాదళ్, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలు. క్రీడలు: హాకీ, అథ్లెటిక్స్, రగ్బీ, క్రికెట్, టెన్నిస్ ఇక్కడి ప్రధానమైన క్రీడలు. 2018 పురుషుల ప్రపంచకప్ హాకీ పోటీలు భువనేశ్వర్‌లో జరిగాయి. బారాబతి క్రికెట్ స్టేడియం, కళింగ స్టేడియం రాష్ట్ర రాజధానిలో ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
24, ఆగస్టు 2019, శనివారం
ఒడిషా (Odisha)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి