1, ఏప్రిల్ 2014, మంగళవారం

మురార్జీ దేశాయ్ (Morarji Desai)

మురార్జీ దేశాయ్
(1896-1995)
జననంఫిబ్రవరి 29, 1896
జన్మస్థలంవల్సాద్‌ (గుజరాత్‌)
చేపట్టిన పదవులుప్రధానమంత్రి (1977-79), బొంబాయి ముఖ్యమంత్రి (1952-57),
మరణంఏప్రిల్ 10, 1995
ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మరియు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన మురార్జీ దేశాయి  ఫిబ్రవరి 29, 1896న నేటి గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాద్‌లో జన్మించారు. 1952-57 కాలంలో బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 1967-69 కాలంలో కేంద్రమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, 1977-79 కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. భారతదేశ మరియు పాకిస్తాన్ యొక్క అత్యున్నత అవార్డులైన భారతరత్న మరియు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డులు పొందినారు. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కీర్తిపొందిన మురార్జీదేశాయ్ ఏప్రిల్ 10, 1995న మరణించారు.

ప్రారంభ జీవనం:
మురార్జి దేశాయ్ బాంబే ప్రెసిడెన్సీ లోని వల్సాద్ (ఇప్పడు గుజరాత్)లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఫిబ్రవరి 29, 1896 న జన్మించారు. ముంబాయి విల్షన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి గుజరాత్ సివిల్ సర్వీస్ లో చేరారు . 1924 లో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ను వదిలి 1930 లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో చేరారు. స్వాతంత్ర సమరయోధుడుగా చాలా సంవత్సరాలు జైలులో గడిపారు. గుజరాత్ లో ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడు గా చలామణి అయ్యారు. 1934 మరియు 1937 లో బొంబే ప్రెసిడెన్సీలో రెవిన్యూ మరియు హోం మినిష్టర్ గా సేవలందించారు . 1952 లో బోంబే స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు. 1967లో కేంద్రమంత్రి పదవి పొందారు. అదేకాలంలో ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు.

ప్రధానమంత్రిగా:
1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి ప్రభావం వల్ల రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు జనతాపార్టీ పేరుతో ఒకటయ్యాయి.మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. 1977 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. 1977, మార్చ్ 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు.

గుర్తింపులు:
1991 సంవత్సరానికిగాను మురార్జీదేశాయ్ భారతరత్న అవార్డును పొందినారు. పాకిస్తాన్ యొక్క అత్యున్నత అవార్డు అయిన నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును కూడా మురార్జీ స్వీకరించారు. .

విభాగాలు: గుజరాత్ రాజకీయ నాయకులు, భారతదేశ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు, కేంద్ర మంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, కేంద్ర ఆర్థికమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక