2, ఏప్రిల్ 2014, బుధవారం

తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం (Tandur Assembly Constituency)


తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014 ఎన్నికలలో ఇక్కడినుంచి తెరాస పార్టీకి చెందిన పి.మహేందర్ రెడ్డి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2018లో సిటింగ్ మంత్రిగా పోటీచేసి ఓడిపోయారు.

నియోజకవర్గ చరిత్ర:
ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించగా మంత్రులుగా పనిచేసిన మల్కోడ్ మాణిక్ రావు 4 సార్లు, మల్కోడ్ చంద్రశేఖర్ 2 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పి.మహేందర్ రెడ్డి 3 సార్లు గెలుపొందినారు. 1972 నుంచి 2009 వరకు జరిగిన 9 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వరసగా మల్కోడ్ కుటుంబ సభ్యులే పోటీచేసి 6 సార్లు విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 4 మండలాలు కలవు.
  • తాండూరు,
  • పెద్దేముల్‌,
  • బషీరాబాద్‌,
  • యాలాల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ శెటి చంద్రశేఖర్ ఇండిపెండెంట్
1967 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ వందేమాతరం రామచంద్రారావు ఇండిపెండెంట్
1972 మల్కోడ్ మాణిక్‌రావు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1978 మల్కోడ్ మాణిక్‌రావు కాంగ్రెస్ పార్టీ ఎన్.సాయిరెడ్డి జనతాపార్టీ
1983 మల్కోడ్ మాణిక్‌రావు కాంగ్రెస్ పార్టీ ఎన్.సాయిరెడ్డి ఇండిపెండెంట్
1985 మల్కోడ్ మాణిక్‌రావు కాంగ్రెస్ పార్టీ ఎన్.బాలప్ప తెలుగుదేశం పార్టీ
1989 మల్కోడ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ పసారం శాంత్‌కుమార్ తెలుగుదేశం పార్టీ
1994 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్కోడ్ నారాయణరావు కాంగ్రెస్ పార్టీ
1999 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్కోడ్ మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ
2004 మల్కోడ్ నారాయణరావు కాంగ్రెస్ పార్టీ పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్కోడ్ రమేష్‌ కాంగ్రెస్ పార్టీ
2014 పి.మహేందర్ రెడ్డి తెరాస మల్కోడ్ నారాయణరావు కాంగ్రెస్ పార్టీ
2018 పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.మహేందర్ రెడ్డి తెరాస



2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కోడ్ నారాయణరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన పి.మహేందర్ రెడ్డిపై 13వేలకు పైగా ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. 
2004 ఎన్నికలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
అభ్యర్థిపార్టీపొందిన ఓట్లు
మల్కోడ్ నారాయణరావుకాంగ్రెస్ పార్టీ69,945
పి.మహేందర్ రెడ్డితెలుగుదేశం పార్టీ56,391

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.మహేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్కోడ్ రమేష్‌పై 13203 ఓట్ల మెజారిటితో విజయం సాధించి 3వ సారి శాసనసభలో ప్రవేశించారు. మొత్తం 16 అభ్యర్థులు పోటీచేయగా 14 అభ్యర్థులు డిపాజిట్ కోల్ఫోయారు. మొత్తం 130521 ఓట్లు పోల్ కాగా మహేందర్ రెడ్డికి 63737, రమేష్‌కు 50534 ఓట్లు లభించాయి. భాజపా తరఫున బాలేశ్వర్ గుప్తా, ప్రజారాజ్యం పార్టీ తరఫున వడ్డె ఆంజనేయులు, లోక్‌సత్తా పార్టీ తరఫున వెంకటేశం పోటీచేశారు. ఒక్క బషీరాబాదు మినహా మిగితా 3 మండలాలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం సాధించింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావుపై 16074 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పట్నం మహేందర్ రెడ్డి, భాజపా తరఫున పటేల్ రవిశంకర్, ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రోహిత్ రెడ్డి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రోహిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, రాష్ట్ర మంత్రి, తెరాసకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి పై 2875 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

హోం,
విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక