ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా సిర్పూరు గ్రామములో జన్మించారు. ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందిన చెన్నారెడ్డి అభ్యసన దశలోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1947-48లో విమోచనోద్యమంలో పాల్గొన్నారు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా చెన్నారెడ్డి పనిచేశారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన మామ కొండా వెంకట రంగారెడ్డి పేరిట హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. డిసెంబరు 2, 1996న మర్రి చెన్నారెడ్డి మరణించారు.
రాజకీయ ప్రస్థానం: విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న చెన్నారెడ్డి విమోచనోద్యకాలంలో చురుకుగా పాల్గొని, ఆతర్వాత రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించారు. 1950లో తాత్కాలిక పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి హైదరాబాదు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించి బూర్గుల మంత్రివర్గంలో స్థానం పొందారు. 1957లో వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశించారు. 1962, 67లో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికై ఇందిరాగాంధీ నేతౄత్వంలోని కేంద్రప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించి తెలంగాణలో 14 స్థానాలకు గాను 11 స్థానాలలో పార్టీని గెలిపించారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 1974లో చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. 1978-80 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించారు. 1989లో రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్, తమిళనాడు గవర్నరుగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
8, ఆగస్టు 2014, శుక్రవారం
మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Thank u sir very use full for us...
రిప్లయితొలగించండి