ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల తొలి మహిళా గవర్నరుగా పేరుపొందిన శారదా ముఖర్జీ ఫిబ్రవరి 24, 1919న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మరాఠీ కుటుంబంలో జన్మించారు. తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూతో ఈమెకు బంధుత్వం ఉంది. భర్త మరణానంతరం రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు లోక్‌సభకు ప్రవేశించడమే కాకుండా 2 రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశారు. జూలై 6, 2007న శారదా ముఖర్జీ ముంబాయిలో మరణించారు
రాజకీయ ప్రస్థానం: భర్త అకాల మరణానంతరం శారద రాజకీయాలలో ప్రవేశించింది. అప్పుటి ప్రధానమంత్రి జనహార్‌లాల్ నెహ్రూతో బంధుత్వం కారణంగా ఈమె కోరుకున్న స్థానం పొందుటలో సఫలమైనారు. బంధువులు అధికంగా ఉండే మహారాష్ట్రలోని రత్నగిరి స్థానం నుంచి 1962లో తొలిసారి పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో పర్యాయం 1967లో కూడా ఇదే స్థానం నూంచి విజయం సాధించారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక సమయంలో ఇందిర వైపు కాకుండా సిండికేట్ కాంగ్రెస్ పక్షాన వహించి 1971లో ఓటమి చెందారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడంతో ఈమెను 1977మేలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. ఆ తర్వాత 1978-83 కాలంలో గుజరాత్ గవర్నరుగా పనిచేశారు. కుటుంబం: శారద చిన్నాన్న (రంజిత్ సీతారాం పండిత్) జవహర్ లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్షిని పెళ్ళిచేసుకున్నారు. శారదా ముఖర్జీ తల్లి సరస్వతీబాయి పండిత్ అలనాటి హిందీ సినిమా నటి దుర్గా ఖోటే సోదరి. ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ ఈమెకు వరసకు చెల్లెలు (బాబాయి కూతురు). శారద భర్త తొలి భారతీయ ఎయిర్ చీఫ్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ. సరోజినీ నాయుడు వీరి వివాహ సంబంధం కుదిర్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, జులై 2020, ఆదివారం
శారదా ముఖర్జీ (Sharda Mukherjee)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి