28, జులై 2020, మంగళవారం

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)

రాజధానిసిమ్లా
వైశాల్యం 55,673 చకిమీ
జనాభా 68 లక్షలు (2011)
అవతరణ1971
హిమాచల్ ప్రదేశ్ ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రము. హిమాలయాలపై ఉన్న ఈ రాష్ట్రం పేరు కూడా దానిపైనే వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ ఇండియా కాలంలో పంజాబ్ ప్రావిన్సులో భాగంగా ఉండి 1956 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1971లో రాష్ట్ర హోదా పొందింది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా నుంచి (లఢక్‌తో పాటు) కేంద్రపాలిత ప్రాంతంగా మారిన పిదప  ఈ రాష్ట్రం దేశంలో అతి ఉత్తరాన ఉన్న రాష్ట్రంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా, అధికార భాష హిందీ, వైశాల్యం 55,673 చకిమీ, జనాభా (2011 ప్రకారం) 68 లక్షలు. షిమ్లా, మనాలి, ధర్మశాల, డల్హౌసీ, చంబా, ఖజ్జియార్, కులూలు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటకం ప్రాంతాలు.

భౌగోళికం:
ఈ రాష్ట్రానికి ఉత్తరాన జమ్మూకశ్మీర్ మరియు లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలు, దక్షిణాన ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, పశ్చిమాన పంజాబ్, నైరుతిన హర్యానా, తూర్పున కొంతవరకు టిబెట్టు (చైనా) సరిహద్దులుగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం విభజితమై లఢక్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలోనే అతి ఉత్తరాన ఉన్న రాష్ట్రంగా మారింది. సింధూనది ఉపనది అయిన బియాస్ నది ఈ రాష్ట్రంలోని బియాస్‌కుండ్ వద్ద జన్మిస్తుంది.

చరిత్ర:
జనపదాల కాలంలో చిన్నచిన్న రాజ్యాలు ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత గుప్తుల కాలంలో విశాల సామ్రాజ్యంలో భాగమైనాయి. క్రీ.శ.11వ శతాబ్దిలో ఘజనీ మహ్మద్ దండయాత్రలకు గురైంది. 18వ శతాబ్దిలో గోర్ఖా రాజ్యంలో భాగంగా నేపాల్‌లో చేరింది. ఆ తర్వాత రంజిత్ సింగ్ నేతృత్వంలోని సిక్కురాజ్యంలో భాగమైంది. బ్రిటీష్ ఇండియా కాలంలో పంజాబ్ ప్రావిన్సులో కొనసాగి స్వాతంత్ర్యానంతరం ప్రత్యేక ప్రావిన్సుగా, 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా, 1971లో ప్రత్యేక రాష్ట్రంగా మారింది.

రాజకీయాలు:
హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, 68 శాసనసభ స్థానాలు కలవు. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించింది. 1977లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ఐదేళ్ళు పాలించగా 1982లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. 1990లో భారతీయ జనతాపార్టీ తొలిసారి అధికారంలోకి రాగా ఆ తర్వాత భాజపా మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య చేతులు మారుతూ వస్తోంది. 2017 నుంచి భాజపా 4వ సారి అధికారంలో ఉంది.


ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక