తెలుగు దినపత్రికలలో అగ్రస్థానం పొందిన ఈనాడు దినపత్రిక 1974లో విశాఖపట్టణంలో రామోజీరావుచే ప్రారంభించబడింది. 1975లో హైదరాబాదులో రెండో ప్రచురణ కేంద్రం ప్రారంభించబడి దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం 23 కేంద్రాల నుంచి ప్రచురించబడుతూ రోజూ 18 లక్షలకు పైగా సర్క్యులేషన్‌తో తెలుగు పత్రికలలో అగ్రస్థానంలో ఉంది.
1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివారులో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభంలో కేవలం 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రముఖ పాత్రికేయుడైన ఏ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకులు. 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 7 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 12 కేంద్రాలే కాకుండా చెన్నై, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీల నుంచి కూడా పత్రిక వెలువడుతూ మొత్తం 23 కేంద్రాల నుండి 18 లక్షలకు పైగా సర్క్యులేషన్‌తో భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది. పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో తెలుగు దేశం పార్టీ అధినేత రామారావు అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది. 1993, 1994లలో జరిగిన మధ్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, వరదలు, తుఫానుల సమయంలో సహాయనిధిని ఏర్పాటుచేసి ఇతోధిక సహాయం చేస్తోంది. 1989 జనవరి 26న గ్రామీణ వార్తల కొరకు జిల్లా మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. ఆదివారం అనుబంధాన్ని 28 పిభ్రవరి 1988 నుండి పుస్తక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్య పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 24 సెప్టెంబర్ 1992న మహిళలకోసం ప్రత్యేకంగా వసుంధర పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యోగవకాశాల కథనాలతో ప్రతిభశీర్షికను ప్రారంభించింది.
= = = = =
|
15, డిసెంబర్ 2014, సోమవారం
ఈనాడు దినపత్రిక (Eenadu Newspaper)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి