15, డిసెంబర్ 2014, సోమవారం

చక్రి (Chakri)

చక్రి
జననంజూన్ 15, 1974
స్వస్థలంకంబాలపల్లి
రంగంసంగీత దర్శకుడు
మరణండిసెంబరు 15, 2014
చలనచిత్ర సంగీత దర్శకుడిగా పేరుపొందిన చక్రి (చక్రధర్ గిల్లా) జూన్ 15, 1974న మహబూబాబాదు జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించారు. బాచి చిత్రంతో సంగీత దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన చక్రి మొత్తం 85 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డును, సింహా సినిమాకు నంది అవార్డును పొందారు. 40 సంవత్సరాల చిన్న వయస్సులోనే డిసెంబరు 15, 2014న మరణించారు.

సంగీత దర్శకుడిగా ప్రస్థానం:

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించారు. సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మొత్తం 85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. సింహా సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నారు. ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి. సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదారి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి , భగీరథ, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయస్సులోనే చక్రి పలు హిట్‌సాంగ్స్ అందించారు. శ్రీమన్నారాయణ, జై బోలో తెలంగాణ సినిమాలకు చక్రి సంగీతం అందించారు. చ‌క్రి సంగీతం అందించిన చివ‌రి చిత్రం ఎర్ర‌బస్సు.

ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: మహబూబాబాదు జిల్లా ప్రముఖులు, సంగీత దర్శకులు, మహబూబాబాద్ మండలం, 1974లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక