4, ఫిబ్రవరి 2015, బుధవారం

ప్రకాశం జిల్లా (Prakasham District)

 ప్రకాశం జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం17,626 చకిమీ
జనాభా33,92,764 (2011)
మండలాలు56
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. జిల్లా పరిపాలన కేంద్రం ఒంగోలు.  ఫిబ్రవరి 2,1970న అవతరించిన ఈ జిల్లాకు 1972లో ప్రకాశం జిల్లాగా పేరు పెట్టబడింది. పింగళి వెంకయ్య, ఎర్రాప్రగడ, టంగుటూరి ప్రకాశం, త్యాగరాజు ఈ జిల్లాకు చెందినవారు. ఒంగోలు జాతి గిత్తలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు, మార్కాపురం పలకలకు ఈ జిల్లా ప్రసిద్ధి చెందింది. జిల్లా వైశాల్యం 17,626 చకిమీ మరియు 2011 లెక్కల ప్రకారం జనాభా జిల్లా 33,92,764. జాతీయోద్యమంలో ప్రసిద్ధి చెందిన చీరాల-పేరాల సంఘటన ఈ జిల్లాలోనే జరిగింది. 5వ నెంబరు జాతీయ రహదారి, చెన్నై - కోల్‌కత రైలుమార్గం, డోన్ - గుంటూరు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నవి. జిల్లా తూర్పు సరిహద్దులో బంగాళాఖాతం ఉండగా వాయువ్య ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు కలవు. జిల్లాలో 56 రెవెన్యూ మండలాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
ప్రకాశం జిల్లాకు ఉత్తరాన గుంటూరు జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన నెల్లూరు జిల్లా, నైరుతిన కడప జిల్లా, వాయువ్యాన తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 17,626 చకిమీ. గుండ్లకమ్మ, మున్నేరు, సగిలేరులు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు.

చరిత్ర:
ఒంగోలు గిత్త
జిల్లా ప్రాంతాన్ని వివిధ కాలాలలో ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం జిల్లాలోనే జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పుడున్న జిల్లా ప్రాంతం నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాలలో భాగంగా మద్రాసు రాష్ట్రంలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రంలోనూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. ఫిబ్రవరి 2, 1970న 3 జిల్లాలలోని ప్రాంతాలను విడదీసి ప్రత్యేకంగా ఒంగోలు జిల్లాను ఏర్పాటుచేశారు. 1972లో టంగుటూరి ప్రకాశం పేరుమీదుగా ప్రస్తుత పేరుకు మార్చబడింది.

టంగుటూరి ప్రకాశం
రవాణా సౌకర్యాలు:
జిల్లా తీరప్రాంతానికి సమీపం నుంచి చెన్నై - కోల్‌కత రైలుమార్గం వెళ్ళుచున్నది. చీరాల, ఒంగోలు ఈ మార్గంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు. డోన్ నుంచి గుంటూరుకు వెళ్ళు మరో రైలుమార్గం గిద్దలూరు, కంబం, దోనకొండల మీదుగా వెళ్ళుచున్నది. 5వ నెంబరు జాతీయ రహదారి కూడా జిల్లా తూర్పు భాగం గుండా ఒంగోలు మీదుగా వెళ్ళుచున్నది. ఇవి కాకుండా జిల్లాలోని ప్రధాన పట్టణాలైనకనిగిరి, గిద్దలూరు, మార్కాపూర్, ఒంగోలు, చీరాల లను కలుపుతూ పలు రహదారులున్నాయి.

ఖనిజాలు:
పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు, మార్కాపురం మండలాలలో లభ్యమౌతుంది. దేశ ఉత్పత్తిలో దాదాపు 80% ఇక్కడే జరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటుకు జిల్లాలోని చీమకుర్తి గనులు ప్రఖ్యాతిగాంచాయి.

రాజకీయాలు:
ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 11, తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో విజయం సాధించగా, 2014 ఎన్నికలలో వైకాపా 6 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. 2009లో ఒంగోలు లోకసభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2014లో వైకాపా పార్టీ అభ్యర్థి గెలుపొందినారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒంగోలు లోకసభలో 7 సెగ్మెంట్లు, బాపట్ల లోకసభలో 4, నెల్లూరు లోకసభలో ఒక సెగ్మెంటులు ఉన్నాయి.

ప్రకాశం జిల్లా జనరల్ నాలెడ్జి

ఇవి కూడా చూడండి :


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, ప్రకాశం జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక