30, ఆగస్టు 2014, శనివారం

కర్నూలు జిల్లా (Kurnool Dist)

కర్నూలు జిల్లా
మండలాలు54
అసెంబ్లీ నియోజకవర్గాలు14
వైశాల్యం 17,658 చకిమీ
జనాభా 40,53,463 (2011)
కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో ఒకటి. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన కర్నూలు పట్టణం ఈ జిల్లా రాజధాని. ఉత్తరాన తెలంగాణ, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు, తూర్పున ప్రకాశం జిల్లా, దక్షిణాన అనంతపురం, కడప జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దుగా తుంగభద్ర మరియు కృష్ణానదులు ప్రవహిస్తున్నాయి. 7 వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచుండగా, 18వ నెంబరు జాతీయ రహదారి కర్నూలు నుంచి ప్రారంభమౌతుంది. జిల్లా తూర్పు భాగంలో శ్రీశైలం అడవులు ఉన్నాయి. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది లాంటి పుణ్యక్షేత్రాలు జిల్లాలో కలవు. జిల్లాలో 54 మండలాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కాలజ్ఞాన సృష్టికర్త పోతులూరి వీరబ్రహ్మం, స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చండ్ర పుల్లారెడ్డి, ప్రముఖ రాజకీయ నాయకులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్య, ప్రముఖ దాత బుడ్డా వెంగళరెడ్డి ఈ జిల్లాకు చెందినవారు. జిల్లా వైశాల్యం 17,658 చదరపు కిమీ మరియు 2011 ప్రకారం జిల్లా జనాభా 40,53,463. కర్నూలు, నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆదోని, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలు.

భౌగోళికం, సరిహద్దులు:
కర్నూలు జిల్లా 17,658 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ భాగంలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన తెలంగాణ రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, తూర్పున ప్రకాశం జిల్లా, దక్షిణాన అనంతపురం మరియు కడప జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తర సరిహద్దుగా తుంగభద్ర నది మరియు కృష్ణానదులు ప్రవహిస్తున్నయి.

స్వాతంత్ర్య సమరయోధుడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జిల్లా చరిత్ర:
1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది. 1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని నిజాం బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టారు.
18వ శతాబ్ధం లో కర్నూలు పఠాన్‌ నవాబు యొక్క జాగీరులో భాగముగా ఉండేది. 1838లో ఈ నవాబు యొక్క వారసుని బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపడంతో ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము మద్రాసు రాష్ట్రములో భాగమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండగా, ప్రస్తుతం 13 జిల్లాల విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది.

రవాణా సౌకర్యాలు:
దేశంలో పోడవైన 7వ నెంబరు (కొత్తపేరు 44) జాతీయ రహదారి జిల్లా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచుండగా, కర్నూలు నుంచి ప్రారంభమై చిత్తూరు వెళ్ళు 18వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. జిల్లాలోని ప్రధాన నగరాలను కలుపుతూ రహదారులు కలవు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే జిల్లా రైలుమార్గాలలో వాడి-గుంతకల్లు మార్గం, గద్వాల-డోన్ మార్గం ప్రధానమైనవి. గుంతకల్ నుంచి డోన్‌కు కలుపుతూ గుంటూరు వెళ్ళు మార్గం కూడా జిల్లా గుండా వెళ్ళుచున్నది. డోన్ మరియు పెండేకల్లు జిల్లాలోని ముఖ్య రైల్వేజంక్షన్లు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, కర్నూలు జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక